Monday, August 17, 2026
HomeLATESTAnanya Raj: 27 ఏళ్ల వయసుకే కన్నుమూసిన టాలీవుడ్ హీరోయిన్!

Ananya Raj: 27 ఏళ్ల వయసుకే కన్నుమూసిన టాలీవుడ్ హీరోయిన్!

Ananya Raj: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది 27 ఏళ్లకే ప్రముఖ నటి మరణించింది.

on
- Advertisement -banner Ad

Ananya Raj: సినీ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్గా పేరు సంపాదించిన అనన్య రాజ్ హఠాత్మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అనన్య రాజ్ హిందీతో పాటుగా తెలుగు చిత్రాలలో కూడా నటించింది. గత నెల 15వ తేదీన మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు అనన్య రాజ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వార్తని తాము ఎంతో బాధతో తెలియజేస్తున్నాము. జూలై 15వ తేదీన తెల్లవారుజామున అనన్య రాజ్ నిద్రలోనే తుది శ్వాస విడిచిందని తెలియజేశారు.

చిన్న వయసులోనే ప్రముఖ నటి మృతి..

గత కొంతకాలంగా అనన్య రాజ్ (Ananya Raj)శారీరక మానసిక అసౌకర్యాలతో ఇబ్బంది పడుతోందని వాటిని అధిగమించేందుకు యోధురాలిగా పోరాడింది కానీ విధి ఆమెను చిన్నచూపు చూసింది అంటూ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలి అంటూ అభిమానులను, మీడియా వారిని విజ్ఞప్తి చేశారు కుటుంబ సభ్యులు. ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్స్ సైతం అనన్యకు నివాళులు అర్పిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Rukmini Vasanth: గ్లామర్ తో హీట్ పుట్టిస్తున్న రుక్మిణీ వసంత్!

అనన్య రాజ్ కెరియర్..

అనన్య రాజ్ విషయానికి వస్తే మోడల్గా తన కెరీర్ ని మొదలు పెట్టి, లాక్మే, కోకో కోల, ఉబర్, అమెజాన్, సాంసంగ్ వంటి వాణిజ్య ప్రకటనలో అనన్య నటించింది. అయితే ఆ తర్వాత సెవెన్ అవర్స్ టు గో, గోస్ట్ తదితర హిందీ సినిమాలలో నటించింది. తెలుగులో తగ్గేదేలే అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది అనన్య రాజ్. అలాగే పలు మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది అనన్య. కొన్ని పాటలకు కూడా దర్శకురాలుగా వ్యవహరించింది అనన్య. అటు సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య రాజ్ మరణ వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:కొరటాల శివ- బాలయ్య మూవీ ఆగిపోయిందా..?

ప్రముఖులు సంతాపం..

అనన్య రాజ్ ముంబైలో పుట్టి పెరిగి అక్కడే చదువు పూర్తి చేసిన ఈమెకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.సినీ పరిశ్రమలో ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ హఠాత్మరణం చెందడంతో సినీ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈనటి ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you