Balakrishna:టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలలో ఒకరిగా పేరు సంపాదించారు. బాలయ్య సినిమా షూటింగ్లో పాల్గొన్న సందర్భంలో కాలికి దెబ్బ తగలడంతో సర్జరీ కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ కొరటాల శివ తో కూడా బాలయ్య సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సమయంలోనే కొరటాల శివ సినిమా ప్రారంభమయ్యింది అనే విధంగా వార్తలు వినిపించాయి.
కొరటాల శివ , బాలయ్య మూవీ పై కొత్త అనుమానాలు..
అయితే ఈ ప్రచారం అవుతున్న వేళ అభిమానులలో పలు రకాల అనుమానాలు వ్యక్తం అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య(Balakrishna) తన కెరీర్ లో కథ పాత్రతోపాటు సినిమా బడ్జెట్ విషయంలో కూడా ప్రత్యేకించి మరీ శ్రద్ధ చూపుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చే రిస్కును తగ్గించుకోవాలని భావిస్తున్నారు. గతంలో కూడా గోపీచంద్ మలినేని చెప్పిన ఒక హిస్టారికల్ కథకు కూడా భారీ బడ్జెట్ అవుతుందని భావించిన బాలయ్య .. ఆ సినిమా కథనే పక్కన పెట్టేశారు. దీంతో వేరే కథతో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
also read:Prabhas: ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే హీరో ఎవరో తెలుసా?
బడ్జెట్ విషయంలో లోటుపాట్లు..
సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో హిస్టారికల్ ప్రాజెక్ట్ సినిమా తెరకెక్కించాల్సి ఉండగా, రూ. 100 కోట్ల రూపాయల పరిధిలోనే ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. కథకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినిపిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ తో తెరకెక్కించే సినిమాకి మాత్రం సుమారుగా 150 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అవుతుందని నిర్మాతలు సైతం వెల్లడించడంతో ఈ సినిమా పైన పలు రకాల సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ బడ్జెట్ కారణంగా బాలయ్య ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
also read:Mega 158:మెగా 158 టైటిల్ అదేనా?
రెండు సినిమాలు ఆగిపోయినట్టేనా?
డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం దేవర 2 పనులలో బిజీగా ఉన్నట్లు వినిపిస్తోంది.అలాగే ఎన్టీఆర్ కూడా డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత ఆ గ్యాప్ లో బాలయ్య సినిమాని తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. కానీ అటు బాలయ్య కు ఇటు ఎన్టీఆర్ కి ఇద్దరికీ కూడా గాయం అవ్వడం చేత రెండు సినిమాలు షూటింగ్ కూడా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో బాలయ్య కొరటాల సినిమా పరిస్థితి ఏంటా అని అభిమానులు కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అధికారికంగా ఎవరు ప్రకటిస్తారో చూడాలి మరి. ఏది ఏమైనప్పటికీ కొరటాల శివ కి మాత్రం ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. మరి ఏ సినిమాతో సక్సెస్ అందుకుంటారో చూడాలి.




