Tollywood:టాలీవుడ్ లో గత కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు వివాహాలు చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఇదే లిస్టులోకి టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో ప్రిన్స్ (Prince Cecil) కూడా చేరారు. బస్ స్టాప్, నీవలెనే వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రిన్స్ ఆ తర్వాత హీరోగా మరిన్ని చిత్రాలలో నటించారు. అయినప్పటికీ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించారు.
రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ప్రిన్స్..
అదే కాకుండా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కూడా పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేమిటంటే సాయి మాచిరాజు అనే అమ్మాయిని గత నెల ప్రిన్స్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.
also read:Tollywood: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కి ఆ టాలీవుడ్ హీరోయిన్ ముని మనవరాలా?
పెళ్లి ఎప్పుడంటే?
తాను త్వరలోనే ఒక ఇంటి వాడిని కాబోతున్నానని అధికారికంగా ప్రకటిస్తూ తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత సంవత్సరం ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తామిద్దరం మొదటిసారి కలుసుకున్నామని, ఆ తర్వాతే ఇద్దరం స్నేహితులమయ్యాము అంటూ తెలిపారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నామని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 24న వీరి వివాహం న్యూజిలాండ్లో జరగబోతున్నట్లు సమాచారం.
also read:Sukumar :RC 17 విషయంలో సుకుమార్ కొత్త స్ట్రాటజీ.. అభిమానుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ!
కామన్ ఫ్రెండ్ ఎవరో కాదు..
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోలో ప్రముఖ నటుడు అయిన ప్రియదర్శి కనిపించడం గమనార్హం ఈ నటుడు ద్వారానే సాయి మాచిరాజు, ప్రిన్స్ మధ్య పరిచయం ఏర్పడిందనే విధంగా వినిపిస్తోంది. ఏదేమైనాప్పటికీ త్వరలోనే ప్రిన్స్ కొత్త జీవితంలోకి అడ్డుపెట్టబోతున్నాడు అని తెలిసి అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఈ జంటకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వివాహం అనంతరం ప్రిన్స్ సరైన కథలతో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి.
https://www.instagram.com/reel/Da7ZZ-yKcVl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==




