Tollywood: సినీ సెలబ్రిటీలు సక్సెస్ అయిన తర్వాత వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి చాలామంది మక్కువ చూపుతూ ఉంటారు. అలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల యొక్క బ్యాగ్రౌండ్ తెలిసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన లోకాన్ని విడిచి వెళ్లిపోయినా ప్రతి పాఠశాలలో ఆయన చిత్రపటం ఉంటుంది. గణిత శాస్త్రానికి సంబంధించి ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇప్పటికీ అమలులో ఉండడం విశేషమని చెప్పవచ్చు. రామానుజ 1887 డిసెంబర్ 22న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. అయితే ఈయన చిన్న వయసులోనే మసూచి వ్యాధి కారణంగా 1920 ఏప్రిల్ 26న మరణించారు.
గణిత పితామహుడికి ముని మనవరాలు..
రామానుజన్ మరణించే సమయానికి ఆయన వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే.. ఇలాంటి గణిత మేధావి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజీ సంపాదించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రీతి ముకుందన్. ఓం బీమ్ బుష్ చిత్రంతో తెలుగు(Tollywood) ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో నటించింది. ఇటీవలే రీసెంట్గా వచ్చిన బ్లాస్ట్ అనే సినిమాతో మరోసారి మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో సోషల్ మీడియాలో కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
also read:Sukumar :RC 17 విషయంలో సుకుమార్ కొత్త స్ట్రాటజీ.. అభిమానుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ!
ఆయన మేన కోడలు కూడా..
ప్రీతి ముకుందన్ తమిళనాడులోని తిరుచ్చిలో రామానుజన్ రోడ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. శ్రీనివాస రామానుజన్ కి ముని మనవరాలు అవుతుందట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రీతీ ముకుందన్ అమ్మ తరపు నుంచి ఈ బంధుత్వం కలుస్తుందని సమాచారం. దీంతో శ్రీనివాస రామానుజన్ ప్రీతి ముకుందన్ కి ముత్తాత అవుతారు. అలాగే గిటారులో మంచి ప్రావీణ్యం కలిగిన మ్యూజిషియన్ గిటార్ ప్రసన్న కూడా ప్రీతి ముకుందన్ కి మేనమామ అవుతారట.
also read:Anasuya:అనసూయ ఫిట్‌నెస్ మంత్రం.. జిమ్ వీడియోతో అభిమానులకు స్పెషల్ మెసేజ్!
స్వతహాగా ఒక్కో మెట్టు ఎక్కుతూ..
మొత్తానికి బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రీతి ముకుందన్ మాత్రం స్వతహాగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి విజయాలను అందుకుంటోంది. ప్రీతి ముకుందన్ కూడా భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం కలదు. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మకు బడా సినిమాలలో నటించే అవకాశాలు రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు




