Vijay Deverakonda:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో జరగబోయే ‘టీజీ20 (TG20) లీగ్’ ఇప్పుడు పెద్ద లీగల్ చిక్కుల్లో పడింది. ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) షాకిస్తూ లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేకుండా రూల్స్ బ్రేక్ చేస్తూ నడుపుతున్న లీగ్‌ను ఎలా ప్రమోట్ చేస్తారంటూ టీసీఏ గట్టిగా నిలదీయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..
లీగల్ నోటీసుల వెనుక అసలు కథేంటి?:
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆరోపణల ప్రకారం.. ఏదైనా కొత్త లీగ్ స్టార్ట్ చేయడానికి కనీసం 45 రోజుల ముందే బీసీసీఐ (BCCI) నుంచి పర్మీషన్ తీసుకోవాలి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఈ టీజీ20 లీగ్‌ను అక్రమంగా నిర్వహిస్తోందని టీసీఏ అంటోంది. అనుమతి లేని లీగ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా విజయ్ దేవరకొండ, వెంకటేష్ వంటి స్టార్స్ యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని టీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రూ. వందల కోట్ల కార్పొరేట్ వ్యాపారం:
ఈ లీగ్ పేరు చెప్పి హెచ్‌సీఏ రూల్స్‌కు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలతో రూ. వందల కోట్ల బిజినెస్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోందని టీసీఏ మండిపడింది. ఇక కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ లీగ్‌ను నడుపుతున్నారని ఆరోపించింది. అందుకే ఈ లీగ్‌తో ఉన్న అగ్రిమెంట్లను వెంటనే రద్దు చేసుకోవాలని లేదా పున:సమీక్షించుకోవాలని సెలబ్రిటీలను హెచ్చరించింది.
also read:Vishnupriya:తగ్గేదేలే అంటున్న విష్ణుప్రియ.. నిజాలు అందరికీ చేదేనా?
లిస్టులో ఉన్న స్టార్స్ వీరే:
ఈ లీగల్ నోటీసులు కేవలం విజయ్ దేవరకొండకే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడులకు కూడా అందాయి. ఈ లీగ్‌తో ఉన్న సంబంధాలపై వీరంతా వెంటనే పునరాలోచన చేయాలని, లేనిపక్షంలో చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో టీసీఏ చాలా స్పష్టంగా పేర్కొంది.
క్రికెట్ లీగ్‌ను ప్రమోట్ చేద్దామనుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఈ లీగల్ నోటీసులు గట్టి షాక్ అనే చెప్పాలి. బీసీసీఐ అనుమతుల చుట్టూ తిరుగుతున్న ఈ లీగల్ వివాదం మరి ఎంతదూరం వెళ్తుందో చూడాలి. ఈ నోటీసులపై విజయ్ దేవరకొండ మరియు మిగతా స్టార్స్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదానికి ఎలా చెక్ పెడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


