Bad Boy Karthik: హీరో నాగ శౌర్యకు అర్జెంట్‌గా హిట్ కావాలి. ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఈ మధ్య కాలంలో కలిసి రాలేదు. మంచి సాలిడ్ హిట్ పడితే తప్ప, నాగ శౌర్య (Naga Shaurya) మళ్లీ నిలబడలేని పరిస్థితి నెలకొందంటే, అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం నాగ శౌర్య చేస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నాగ శౌర్య మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుంది. ఏప్రిల్ 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు.
రగ్డ్ అవతార్‌లో మాస్ ఎంట్రీ (Bad Boy Karthik)
ఈ ట్రైలర్ (Bad Boy Karthik Trailer) విషయానికి వస్తే.. ‘నరసింహా.. ఎన్నో ఏళ్లుగా ఈడ ఇన్ని ఘోరాలు జరుగుతా ఉండాయ్. అట్ట మౌనంగా ఉండిపోయావేంది సామి. మేము తెలుసో, తెలియకో చేసిన పాపాలకు మా ప్రాణాలను తీసుకుపో. ’ అంటూ నరేష్ వీకే పాత్ర దేవుడిని ప్రార్థిస్తూ.. ప్రమాదకరమైన వ్యక్తుల అణచివేతలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంతో ఈ ట్రైలర్ మొదలైంది. అదే టైమ్‌లో రగ్డ్ అవతార్‌లో మాస్ ఎంట్రీ, తన రూల్స్ తో జీవించే వ్యక్తిగా నాగ శౌర్య ఎంట్రీ అదిరిపోయింది. ఇప్పటి వరకు కనిపించని అవతార్‌లో నాగ శౌర్య ఇందులో కనిపించారు. వెన్నెల కిషోర్ కామెడీ మరో ప్రధాన బలం అనేది ఈ ట్రైలర్‌లోనే తెలియజేశారు. విలన్‌గా సముద్రఖని మరోసారి ‘సర్కారు వారి పాట’ని తలపిస్తుంది. నరేష్ కోరుకున్నట్లుగా నరసింహ స్వామిలా మారి, ఆ ఘోరాల నుంచి ప్రజలను కార్తిక్ ఎలా కాపాడాడు? విలన్‌పై అతను ఎలా పోరాడుతాడు, అమాయకులని ఎలా కాపాడుతాడు? అనే రొటీన్ కథాంశమే ఇందులో ఉందనే ఫీల్‌ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. కథ రొటీన్‌గా ఉన్నా, స్క్రీన్‌ప్లేతో హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి కాబట్టి, కథ ఏంటనేది ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి, ఈ సినిమాను స్క్రీన్‌ప్లేతోనే లాక్కురావాలి.
Also Read- TV Movies: ఏప్రిల్ 07, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!
వెరైటీ పాత్రలో డైలాగ్ కింగ్
ఇక నాగ శౌర్యకు ఇందులో ఒక్క డైలాగ్ కూడా లేదు కానీ, ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్ పాత్ర ఇందులో చేసినట్లుగా అయితే తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు, తనలోని వేరియేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా సాయి కుమార్‌తో వచ్చే ఫన్ సీన్స్ చూస్తుంటే.. ఆయన పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో శౌర్య లార్డ్ లక్ష్మీ నరసింహ స్వామి ప్రజెన్స్ లో కనిపించడం గూస్‌బంప్స్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ విధి, విలన్‌గా సముద్రఖని, మైమ్ గోపీ, శ్రీదేవి విజయకుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి వారికి ట్రైలర్‌లో మంచి స్పేస్ దొరికింది. దర్శకుడు రమేష్ ఈ సినిమాను కమర్షియల్ ప్యాకేజీగా మలిచినట్లుగా చెప్పడంలో ట్రైలర్ సక్సెస్ అయింది. సినిమాటోగ్రఫీని రసూల్ ఎల్లోర్ అందంగా చూపించగా, హారిస్ జయరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ అనేలా ఉంది.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తాడా?
ఆరెంజ్ చూసినప్పటి నుంచి..
ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ..మా నిర్మాత ఈ సినిమాను ఎంతో పట్టుదలతో పూర్తి చేశారు. ఆయనకి హ్యాట్సాఫ్. ఆయన అనుకున్నదంతా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్, పేరు రావాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లకు వచ్చి, చూసి ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ‘ఆరెంజ్’ సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్‌తో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో నా కోరిక తీరింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే రసూల్0తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అనుకునేవాడిని. ఆయన కెమెరాలో నేను ఎలా కనిపిస్తానో చూడాలని ఉండేది. ఆ కోరిక కూడా తీరింది. ఆయన నన్ను చాలా బాగా చూపించారు. ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాలో శ్రీదేవి పాత్ర చూసాను. అలాంటి అదృష్టం నాకు కూడా ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ఆమె ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. అందరూ సినిమా చూడాలని, అందరికీ ఈ సినిమా నచ్చాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

