Monday, June 22, 2026
HomeLATESTBhagya sree: భాగ్యశ్రీ పెళ్లి రామ్ తోనేనా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!

Bhagya sree: భాగ్యశ్రీ పెళ్లి రామ్ తోనేనా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!

Bhagya sree: గత కొంతకాలంగా రామ్ తో భాగ్యశ్రీ ప్రేమలో ఉందనే రూమర్సు గట్టిగా వినిపిస్తున్న వేళ ఈమె ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Bhagya sree: సాధారణంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి కాస్త కలిసి కనిపించినా లేదా పదేపదే కలిసి సినిమాలు చేసినా సరే వారి మధ్య ఏదో ఉందనే పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ కలసి కెమెరా కంట పడ్డారు అంటే కచ్చితంగా వారి మధ్య లేనిపోని ఎఫైర్ రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఎఫైర్ రూమర్స్ లో కొన్ని నిజమైతే.. మరికొన్ని కట్టు కథలు గానే మిగిలిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక జంట పేరు గత కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఆ జంట ఏదో కాదు రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే..

ఎఫైర్ రూమర్స్.. రామ్ తో పెళ్లి..

రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతో విజయాన్ని అందుకోలేదు. కానీ తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేని( Ram pothineni)హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా విజయాన్ని అందించలేదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు భాగ్యశ్రీ(Bhagya sree) కోసమే రామ్ లిరిసిస్ట్ గా, సింగర్ గా మారాడు అనే టాక్ కూడా నడిచింది. అయితే అప్పట్లో ఈ వార్తలను రామ్ కొట్టి పడేశాడు. కానీ భాగ్యశ్రీ మాత్రం రామ్ తో రిలేషన్ గురించి మరోసారి గట్టిగా హింట్ ఇచ్చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఈమె తెలుగింటి కోడలు కాబోతోందా ? అందుకే హైదరాబాద్ ను సెకండ్ హోమ్ అని చెప్పేసిందా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

also read:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత!

హైదరాబాద్ నా సెకండ్ హోమ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ.. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే సుమా టాక్ సోలో పాల్గొన్న భాగ్యశ్రీ.”నా మొదటి ఇల్లు ఔరంగాబాద్.. నా సెకండ్ ఇల్లు హైదరాబాద్.. ఆల్రెడీ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క స్టేట్మెంట్ తో రామ్ అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రేమ నిజమే అని సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసేస్తున్నారు. మరి త్వరలోనే రామ్ , భాగ్యశ్రీ కలిసి పెళ్లి కబురు చెప్తారేమో చూడాలి. ఏదేమైనా ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే అభిమానులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు.

- Advertisement -

also read:Deewana movie review:దీవానా మూవీ రివ్యూ.. హృదయాన్ని కదిలించిందా?

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you