Trisha – Vijay:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి, కోట్లాదిమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. ఇక ఆ అభిమానంతోనే రాజకీయాల్లోకి రావాలని ఎంతో పరితపించారు. అందులో భాగంగానే టీవీకే అనే పార్టీని స్థాపించి.. ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తొలిసారి పోటీ చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తొలి ప్రయత్నం లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా అవతరించి నేడు తమిళనాడు రూపు రేఖలను మారుస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా దేశం మొత్తం తమిళనాడు వైపు చూసేలా సరికొత్త స్కీములతో అందరిని ఆలోచనలో పడేశారు విజయ్ .
విజయ్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు..
ఇకపోతే విజయ్(Vijay Thalapathy) నేడు రాజకీయంగా వేగంగా పావులు కదుపుతూ దూసుకుపోతుంటే.. మరొకవైపు ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారాలు చేస్తున్న సమయంలో ఆయన భార్య సంగీత(Sangeetha) సడన్ గా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఒక నటి వల్లే తాను తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పింది .అయితే ఆమె ఆ నటి ఎవరు అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మరొకవైపు ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ త్రిష తో ఆయన చట్టపట్టలేసుకొని తిరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
also read:Varanasi : ‘వారణాసి’ ఓటీటీ డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ టాక్!
విజయ్ త్రిష మధ్య బ్రేకప్..
ముఖ్యంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఓపెన్ గానే కామెంట్లు చేశారు. ఇకపోతే ఈ వార్తలను త్రిష(Trisha ) ఇండైరెక్టుగా కొట్టిపారేసే ప్రయత్నం చేసింది కానీ దీనిపై విజయ్ స్పందించలేదు. ఇక ఎన్నికల ప్రచారం దగ్గర నుండి ప్రమాణస్వీకారం వరకు ఆయన వెంటే నడిచిన త్రిష.. ఇప్పుడు విజయ్ కి బ్రేకప్ చెప్పిందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి . దీనికి కారణం ఇటీవల విజయ్ దళపతి పుట్టినరోజు కాగా, అటు సెలబ్రిటీలు, సామాన్యులు, ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ త్రిష నుండి ఒక్క మెసేజ్ కూడా లేకపోవడం అందరిని ఆలోచనలలో పడేసింది.
విడాకులకు బ్రేక్ పడినట్టేనా?
అయితే త్రిష ఆయనకు విషెస్ చెప్పకపోవడానికి కారణం సంగీత అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సంగీత విడాకులు కావాలని కోరడంతో విజయ్ తల్లి రంగంలోకి దిగిందట. రాజకీయంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఆమె రంగంలోకి దిగి సంగీత – విజయ్ మధ్య సఖ్యత కుదుర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సంగీత ఒక్కటి కాబోతున్నారని అందుకే త్రిష ఆయనకు దూరంగా వెళ్లబోతుందని సమాచారం. ఇకపోతే త్వరలో దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
also read:OTT movies:అవతార్ 3 నుండి బాహుబలి ది టార్చ్ బేర్ వరకూ.. ఈ ఒక్క వారంలోనే ఓటీటీలో 21 సినిమాలు..
సోదరుడు అని సంబోధించిందా?
దీనికి తోడు సోషల్ మీడియాలో మరో వార్త చెక్కర్లు కొడుతోంది. ట్విట్టర్ వేదికగా ఒక నెటిజన్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ పోస్ట్ సారాంశం విషయానికి వస్తే అందులో త్రిష విజయ్ ను సోదరుడు అని సంబోధించినట్లు ఒక పోస్టును కూడా షేర్ చేశారు. ఏదేమైనా ఇప్పుడు త్రిష విజయ్ మధ్య బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో కొత్త వార్తలు పుట్టుకు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


