Film industry:గత కొంతకాలంగా అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్, హైదరాబాద్ సన్రైజర్స్ అధినేత కావ్య మారన్(kavya maaran) వివాహం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలు గతంలో ఎన్నోసార్లు వినిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై ఎట్టకేలకు ఒక అధికారిక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అనిరుధ్ కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సినీ నటుడు వైజి మహేంద్రన్ వీరిద్దరి వివాహం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనిరుద్ , కావ్య పెళ్లిపై సీనియర్ నటుడు కామెంట్
గత కొంతకాలంగా అనిరుధ్(Anirudh), కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపైన ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించకపోవడంతో రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా నటుడు వైజి మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరింది. వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే కాదని త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు అనే విధంగా ఒక హింట్ ఇచ్చారు.
also read:Balan the boy:థియేటర్లో దుమ్ము దులిపేస్తున్న మలయాళం మూవీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?
కావ్య – అనిరుద్ వ్యక్తిగత జీవితంపై నటుడు స్పందన..
అనిరుధ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అనిరుధ్ చాలా సున్నితమైన వ్యక్తి అని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వారు అని, ఇదే క్రమంలోనే కావ్య మారన్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. నేను విన్న ప్రకారం వారిద్దరి వివాహం త్వరలోనే జరగబోతోందని, కావ్య మారన్ సాదాసీదా అమ్మాయి అయితే కాదు, ఐపీఎల్ వంటి సన్రైజర్స్ టీమ్ ని ఒంటి చేత్తో నడిపించగలిగిన సమర్ధురాలు, తన తండ్రి నుంచి వ్యాపార మెలుకువలు కూడా చాలా అద్భుతంగా నేర్చుకుంది. అనిరుధ్, కావ్య ఇద్దరు కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి అటు వ్యాపార , సంగీత రంగాలలో మరింత రాణించాలి అంటూ వైజి మహేంద్రన్ ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు.
పెళ్లి ఎప్పుడంటే?
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో దీని వివాహం చాలా గ్రాండ్గా జరగవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని , స్పెయిన్ దేశంలో వీరి వివాహం జరగబోతుందని సమాచారం. ఆ తర్వాత చెన్నైలో చిత్ర పరిశ్రమ, రాజకీయ, వ్యాపార రంగాలకు సంబంధించిన ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్ ని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయాల పైన ఎవరు అధికారికంగా స్పందిస్తారో చూడాలి మరి.
also read:Dilraju:ఆ సినిమాల విషయంలో తప్పు చేశా.. దిల్ రాజ్ కామెంట్స్ వైరల్!
అనిరుధ్ సినిమాలు..
అనిరుధ్ సినిమాల విషయానికే వస్తే .. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లీగ్లలో పలు జట్లకు కూడా అధినేతగా వ్యవహరిస్తోంది. మరి వీరి విషయంపై ఎవరు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.
Anirudh – Kavya Maaran wedding 🔜 pic.twitter.com/H9gXjjP15j
— Christopher Kanagaraj (@Chrissuccess) June 28, 2026


