Monday, June 29, 2026
HomeLATESTSuriya : రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో సూర్య?

Suriya : రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో సూర్య?

Suriya : ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Suriya : సినీ సెలబ్రిటీలు సైతం రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చాలామంది సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా ఇప్పటికీ జయలలిత, ఎంజీఆర్, తమిళ హీరో విజయ్ దళపతి(vijay thalapathy) కూడా ఇటీవల సీఎం కూడా అయ్యారు. తెలుగులో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా సక్సెస్ అయ్యారు.మరి కొంతమంది పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో హీరో సూర్య(Suriya )కూడా ఒకరు. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తన సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటాయి.

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా..

ఇకపోతే సూర్య రాజకీయాలలోకి రాబోతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం సూర్య తీసుకున్న నిర్ణయం అభిమానులను మరింత ఆనంద పరుస్తుందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం సూర్య కెరియర్ పీక్ స్టేజ్ లో నడుస్తోందని చెప్పవచ్చు. తమిళగ వెట్రి కళగం పార్టీతో విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సీఎం గా కొనసాగుతూ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.

- Advertisement -

ఇలాంటి సమయంలో నిర్ణయం సరైనదేనా?

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ , అజిత్ కుమార్ వంటి టాప్ హీరోలు కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేయడం లేదు. ఇలాంటి తరుణంలో తమిళ సినీ పరిశ్రమకు ఉన్న అతిపెద్ద దిక్కు స్టార్ హీరో సూర్య మాత్రమే అని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన కరుప్పు సినిమా కూడా భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాతో హీరో సూర్య మళ్లీ టాప్ లిస్టులో చేరారని చెప్పవచ్చు. మరి ఇటువంటి తరుణంలో సూర్య ఫోకస్ పొలిటికల్ వైపుగా వెళితే మాత్రం అది తన యాక్టింగ్ కెరియర్ పైన కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

also read:Film industry:కావ్య మారన్- అనిరుధ్ వివాహంపై హింట్ ఇచ్చిన సీనియర్ నటుడు!

- Advertisement -

రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ ఖాయమా?

రాజకీయాలు అనేది కేవలం పర్సనల్ ఛాయస్ అయినప్పటికీ .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సూర్య రాజకీయాల పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇకపోతే సూర్య తన సినిమాల ద్వారా అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సేవా గుణంతో ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు అంతేకాదు ఫౌండేషన్స్ ను స్థాపించి విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లుగా మార్చి దేశానికి సేవ చేస్తున్నారు. సినిమాలలో హీరోగా నటించిన నిజజీవితంలో ఎంతో మంది జీవితాలలో రియల్ హీరో అనిపించుకొని మరింత పేరు దక్కించుకుంటున్నారు సూర్య. ఒకవేళ తన సినీ కెరియర్ను పక్కనపెట్టి ప్రజల కోసం సేవా గుణంతో రాజకీయాల్లోకి అడుగుపెడితే మాత్రం ప్రజలు ఆయనకు పట్టం కడతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరి చూద్దాం రాజకీయాలా.. సినిమాలా.. సూర్య అడుగు ఎటువైపు పడుతుందో..

also read:Balan the boy:థియేటర్లో దుమ్ము దులిపేస్తున్న మలయాళం మూవీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you