Saturday, July 4, 2026
HomeLATESTNababandham Movie Review: 'నాగబంధం' మూవీ రివ్యూ.. విజువల్ వండర్ గా ఆకట్టుకుందా?

Nababandham Movie Review: ‘నాగబంధం’ మూవీ రివ్యూ.. విజువల్ వండర్ గా ఆకట్టుకుందా?

Nababandham : విరాట్ కర్ణ, ఐశ్వర్య మీనన్, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన నాగబంధం మూవీ రివ్యూ వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

సినిమా :నాగబంధం
నటీనటులు: విరాట్ కర్ణ, ఐశ్వర్య మీనన్, నభా నటేష్, మహేష్ మంజ్రేకర్, దక్ష నాగర్కర్, జగపతిబాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు.
కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా
సంగీతం: జునైద్ కుమార్- అభే

సినిమా స్టోరీ:

Nababandham Movie Review:1962లో హిమాలయ ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ కాలవృక్షంలో వందేళ్లు బందీగా ఉన్న బైరాగి (గరుడ) అలి (రిషబ్ సహ్నీ) కి బ్రహ్మకమలం ఎక్కడ ఉందో తెలుసుకునే పనిని అప్పచెబుతాడు. అదంతా తెలుసుకోవడానికి మార్గం కేవలం ఒకే ఒక పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఒక పని అయితే ఆ సమయంలో టెస్లా అనే మరోకరికి ఆ పుస్తకం హిమాలయ ప్రాంతంలో దొరుకుతుంది. ఆ పుస్తకం ఆలీ చేతుల్లో పడకుండా జాగ్రత్తగా తీసుకువచ్చి ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు) కి అందజేస్తారు. దీంతో నాగబంధం అనే ఒక రహస్యాన్ని చేదించే ప్రయత్నంలో ఉంటారు. అయితే అది రంగనాథ స్వామి గుడిలో ఉండే బ్రహ్మ కమలాన్ని కొందరు దొంగలిస్తారు. అలాంటి సమయంలోనే తన చెల్లెలు అంటే ప్రాణం ఇచ్చే రుద్ర (విరాట్ కర్ణ) ఆమె పెళ్లిలో ఊహించని విషాదాన్ని ఎదుర్కొంటాడు. ఆ సమయంలోనే బ్రహ్మ కమలం దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలని ఆలీ ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో కొన్ని వందల ఏళ్లుగా శాపంతో చెట్లలోనే ఇరుక్కుపోయిన బైరాగి కూడా ఆ బ్రహ్మకమలం మీదే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ బ్రహ్మ కమలం కోసమే రుద్రా కుటుంబాన్ని కూడా దారుణంగా చంపేస్తారు ఆలి.

- Advertisement -

అలా తన ప్రాణంగా ప్రేమించిన పార్వతి (నభా నటేష్) కూడా రుద్రాను వెన్నుపోటు పొడుస్తుంది. అలా అన్ని విషాదాల మధ్య రుద్ర ఎలా బయటపడతాడు? అనంతమైన శక్తుల కోసం విలన్ చేసే కుట్రలను ఎలా అడ్డుకుంటాడు? పద్మనాభ స్వామి గుడికి? బ్రహ్మ కమలానికి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాలి.

also read:Vishwambhara:ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

- Advertisement -

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి అతిపెద్ద బలం విజువల్స్, సౌందర్ రాజన్ తన అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ ను కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని కొన్ని సన్నివేశాలు అటు ఇటుగా ఉన్నప్పటికీ సినిమాని గ్రాండ్ విజువల్ అనుభూతిగా చూపించారు డైరెక్టర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

also read:OTT:కేరళలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న మలయాళం మూవీ!

- Advertisement -

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రధాన బలహీనత. యాక్షన్ ఎపిసోడ్లు అవసరానికి మించి సాగదీశారు. సంభాషణలకు అంతగా ప్రాధాన్యత చూపకపోవడం, హిందీ సీరియల్ రాసుకున్న తెలుగు డబ్బింగ్ లాగా అనిపిస్తుంది..

నటీనటుల యాక్టింగ్:

నటుడు విరాట్ కర్ణ కష్టపడిన తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మంచి ఫిజిక్ ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా నాగ సాధువు పాత్రలో తన యాక్టింగ్ అదరగొట్టేశారు. అయితే రుద్ర పాత్రలో హీరోయిజం ప్రభావం మాత్రం అంతగా చూపించలేకపోయారు.

నభా నటేష కూడా ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించింది. ఏకంగా ఒక పాటలో నాన్ స్టాప్ గా సింగిల్ టేక్ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకుంది.

ఆలి, దండయాత్రికుడు అహ్మద్ షా అద్దాలు పాత్రలో.. ఆలి తన విలనిజంతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.

జగపతిబాబు కూడా తనదైన సహజమైన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా పూజారి అత్యుత్త పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా ఆకట్టుకున్నారు.

రుద్రా సోదరిగా సోనియా సింగ్ ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించినా.. ఆమె పాత్రకు పెద్దగా ఆస్కారం సినిమాలో కనిపించలేదు.

దక్ష నాగర్కర్, ఐశ్వర్య మీనన్ పాత్రలు చిన్నవే అయినా కథకు పెద్దగా ఉపయోగపడేలా కనిపించలేదు. ఇక అనసూయ భరద్వాజ్ పరిమితి నిడివి ఉన్నప్పటికీ తన పాత్రలో అద్భుతంగానే నటించింది.

రేటింగ్:2.25/5

మొత్తంగా సనాతన హిందూ ధర్మం కోసం చేసే  పోరాటం ఈ సినిమా.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you