Monday, July 6, 2026
HomeLATESTSanjana Galrani:తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన!

Sanjana Galrani:తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన!

Sanjana Galrani: బిగ్ బాస్ బ్యూటీ సంజన తాజాగా తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ బుల్లితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

on
- Advertisement -banner Ad

Sanjana Galrani:గతంలో పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ హీరోయిన్ సంజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005లో సోగ్గాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత తమిళ్, కన్నడ వంటి చిత్రాలలో నటించిన సంజన(Sanjana Galrani) ప్రభాస్(Prabhas) నటించిన బుజ్జిగాడు సినిమాలో కీలకమైన పాత్రలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. ఆ తర్వాత సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహో యమ, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలలో నటించింది. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యింది.

సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

గతంలో వివాహమైన తర్వాత ఒక కేసు విషయంలో ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. వీటివల్ల సంజన కెరియర్ లో గ్యాప్ ఎక్కువగానే వచ్చేసింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన ఇప్పుడు తెలుగు సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సంజన తో పాటుగా శ్రవణ్ , సోనియా ముఖ్యమైన పాత్రలుగా నటిస్తున్న సీరియల్ “ఏ దేవి వరమో నీవు” అనే సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ జూలై ఆరవ తేదీ నుంచి స్టార్ మా చానల్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది.

- Advertisement -

ALSO READ:Akhil: అఖిల్ ‘లెనిన్’కు బిగ్గెస్ట్ అసెట్ ఇదే.. ఈసారి బ్లాక్‌బస్టర్ ఖాయమా?

ఘనంగా సీరియల్ లాంచ్..

ఈ సీరియల్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కూడా హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహించారు మేకర్స్ .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో బాలు వచ్చారు. ఈ సీరియల్ నటీనటులు కూడా హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో మొదటి ఎపిసోడ్ కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం ఉంటున్న సీరియల్స్ కి దీటుగా ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది.. ఈ సీరియల్ లో సంజన ఎలా నటిస్తుంది ? ఆమెకు ఈ సీరియల్ ద్వారా మరిన్ని సినిమా అవకాశాలు, సీరియల్ లో నటించే అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

- Advertisement -

ALSO READ:Regina Cassandra:నక్క తోక తొక్కిన రెజీనా..టాప్ హీరోయిన్స్ కుల్లుకునే ఛాన్స్ కొట్టేసింది..!

ఏ దేవి వరమో నీవు సీరియల్ మెయిన్ థీమ్..

ఈ సీరియల్ ప్రేమికుడు మోసం చేసిన గీతాంజలి కి ఒక పాప జన్మిస్తుంది.. అయితే ఆమె తండ్రి, అన్నయ్య ఈ పాపను తమ వారసురాలిగా అసలు అంగీకరించరు. దీంతో ఆమెను ఒక అనాధ ఆశ్రమంలో విడిచిపెడతారు. అక్కడే అంజలి పెరిగి పెద్దయిన తర్వాత ఆ పాప అనుకోని పరిస్థితులలో తన తల్లి దగ్గరికి చేరుకోవలసి వస్తుంది. ఇంతకీ గీతాంజలి తన కూతురు అంజలిని గుర్తు పడుతుందా? అంజలికి తల్లి ప్రేమ దక్కుతుందా? లేదా ?అనేది ఈ సీరియల్ కథాంశం

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you