Pinaka Teaser:ప్రమోషన్స్ లేకుండా కూడా ఒక సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తుందా..? అంటే అవును అని ప్రూవ్ చేసింది ‘పినాక’. కన్నడ స్టార్, గోల్డెన్ మెగాస్టార్ గణేష్(GOLDEN MEGASTAR GANESH) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇదే. కొరియోగ్రాఫర్ బి. ధనుంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కన్నడలో తొలి సినిమా:
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది? ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎందుకు ఇంత ఘనంగా నిర్మిస్తోంది? ఈ సినిమా కథ అంత హైలెట్‌గా ఉండబోతుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్యానర్‌లో 49వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం మరో హైలెట్ పాయింట్ అని చెప్పాలి.
ALSO READ:Trisha:త్రిష టంగ్ స్లిప్..రానాను “లేడీస్ మ్యాన్” అంటూ షాకింగ్ కామెంట్!
టీజర్‌తో మరింత పెరిగిన ఆసక్తి:
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. అడ్వెంచర్, పురాణాలు, రహస్యాల మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా వేరే ఏదో రేంజ్‌లో ఉండబోతుందనే విషయం ఈ చిన్న టీజర్‌తోనే పూర్తిగా అర్థమైపోయింది.
ALSO READ:OTT :ఈ వారం OTTలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.. స్ట్రీమింగ్‌కు వస్తున్న టాప్ సినిమాలు ఇవే!
మిస్టరీ, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ హైలెట్:
మిస్టరీ, బ్లాక్ మ్యాజిక్ అంశాలను హైలెట్ చేస్తూ కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు బి. ధనుంజయ్ గట్టిగా ప్రయత్నించినట్లు ఈ చిన్న టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్‌లో గణేష్ ‘క్షుద్ర’, ‘రుద్ర’ అనే రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించడం హైలెట్‌గా మారింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ కచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ కాబోతుందని మాట్లాడుకుంటున్నారు.
గణేష్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీ?
గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథ ఉండడం మరో హైలెట్‌గా మారబోతోంది. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఒక కొత్త కోణాన్ని చూపించే అవకాశం ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి:
టీజర్‌లో వచ్చిన డైలాగ్స్ కంటే కూడా విజువల్స్‌కే ఎక్కువగా హైలెట్ అయ్యాయి. మూవీ టీమ్ కూడా దానిపైనే ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. చీకటి వాతావరణం, రహస్య ప్రదేశాలు, పురాతన శిల్పాలు, బ్లాక్ మ్యాజిక్… ఇలా జనాల్లో క్యూరియాసిటీ పెంచే ఎన్నో ఎలిమెంట్స్‌ను హైలెట్ చేస్తూ, విజువల్‌గా మరో ప్రపంచానికి తీసుకెళ్లే విధంగా టీజర్‌ను రూపొందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ను కలిగించింది. ఈ సినిమాకు మ్యూజిక్ మరో బలంగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్:
కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న బి. ధనుంజయ్ దర్శకుడిగా తొలి చిత్రానికే డిఫరెంట్ జానర్‌ను ఎంచుకోవడం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ మాత్రం అభిమానులకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. సోషల్ మీడియాలో టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. మరి ఎందుకు ఆలస్యం… ఈ సినిమా టీజర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి!


