Naga Vamshi:టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన నాగవంశీ నిరంతరం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే తన నిర్మాణ సంస్థ విడుదల చేయబోతున్న చిత్రాలు , విడుదల చేసిన చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ముఖ్యంగా అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి కాంబినేషన్లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం” బ్లాస్ట్ “.ఈ సినిమా తెలుగు లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాల లేకుండా విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.
అందుకే బ్లాస్ట్ కి తెలుగులో ప్రమోషన్ చేయలేదు..
తెలుగులో బ్లాస్ట్ సినిమాని నాగవంశీ(Naga Vamshi) విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్ చేయకపోవడానికి గల కారణాన్ని కూడా తాజాగా తెలియజేశారు. లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ.. బ్లాస్ట్ చిత్రాన్ని సరిగ్గా ప్రచారం చేయలేకపోయామని అంగీకరించారు. అందుకు కారణం బ్లాస్ట్ రిలీజ్ అయిన సమయంలో పెద్ది(Peddi) సినిమా కూడా విడుదల అయింది. నేను క్రాస్ ప్రమోషన్స్ చేస్తే కావాలని చేశారని చాలామంది తనని అనే వారిని పెద్ది రిలీజ్ అయ్యాక చేస్తే సినిమా డ్యామేజ్ చేయడానికి మైకు పట్టుకున్నావా అంటూ చాలామంది విమర్శిస్తారని తెలిపారు.
also read:OTT:8.3 IMDB రేటింగ్‌తో దూసుకుపోతున్న మలయాళ మూవీ.. నరాలు తెగిపోయే ట్విస్టులు..!
ఆయన కూడా నా మిత్రుడే..
ఇవన్నీ పక్కన పెడితే పెద్ది నిర్మాత సతీష్ కిలారు కూడా నాకు మంచి స్నేహితులే.. ఆయన బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే తాను ప్రచారాన్ని పరిమితం చేశానని తెలియజేశారు. బ్లాస్ట్ సినిమా రెండు వారాల ముందే విడుదలై ఉంటే కలెక్షన్స్ మరింత ఎక్కువ సాధించేదేమో అంటూ నిర్మాత తన అభిప్రాయంగా తెలియజేశారు. కానీ థియేటర్లలో మాత్రం మంచి స్పందన లభించింది. ఓటీటిలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాకి మంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అంటూ తెలియజేశారు.
also read:NTR:ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు క్రేజీ హీరోయిన్ ఓకే.. బ్లాక్‌బస్టర్ జోడీ మావ ఇది!?
టికెట్ ధరలు కాదు పాప్ కార్న్ ధరలే ఎక్కువ..
ఇక రాంచరణ్ తో కూడా తాను కొన్నేళ్లుగా సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఎందుకో కుదరడం లేదంటూ వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు అని అభిప్రాయాన్ని నిర్మాత నాగవంశీ ఖండించారు. ముఖ్యంగా టికెట్ ధరల కంటే సినిమా థియేటర్లలో విక్రయించే పాప్ కార్న్, టాక్స్ ధరలకు ప్రేక్షకులు వెనక్కి తగ్గుతున్నారని కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే థియేటర్లో తినడానికి భారీగా ఖర్చు చేయవలసి వస్తుందని భావనలో ఉన్నారని తెలిపారు. ఇక ప్రేక్షకులు కూడా రివ్యూలు , రేటింగ్స్ కంటే సినిమా చూసి వారి నుంచి వచ్చే మౌత్ టాకును ఎక్కువగా నమ్ముతున్నారని తెలియజేశారు.


