Vk.Naresh:ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్న రావణ్9 Prashna Raavan) అరెస్టు వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆయనపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు కావడం పలు వర్గాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
యూఏపీఏ కేంద్ర చట్టం అని గుర్తుంచుకోవాలి:
నరేష్ తన ట్వీట్‌లో యూఏపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం కాదని, ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చట్టమని పేర్కొన్నారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు ఒక రాష్ట్రానికే పరిమితం కావని, అవసరమైతే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంటుందని క్లియర్‌కట్‌గా వివరించారు. అందువల్ల ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్త అవసరం:
సోషల్ మీడియాలో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసే వారికి ఈ ఘటన ఒక హెచ్చరికగా భావించాలని నరేష్(Vk.Naresh) అభిప్రాయపడ్డారు. ఎలాంటి విషయంపై అయినా పూర్తిగా అవగాహన లేకుండా స్పందించడం భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
also read:Samantha:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం.. సమంత సెన్సేషనల్ డెసీషన్..!?
రాజకీయ పరిణామాలపై తన విశ్లేషణ:
జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్, ఆయన బృందం చేపడుతున్న చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని నరేష్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో కుల, మత అంశాల చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలను ప్రజలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు.
also read:Janhvi Kapoor: రాయల్ లుక్ లో మెస్మరైజ్ చేసిన జాన్వీ కపూర్.. అవుట్ ఫిట్ ప్రత్యేకత ఏంటంటే?
తాను రాజకీయ విశ్లేషకుడినే: నరేష్
తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఒక రాజకీయ పరిశీలకుడిగా మాత్రమే విశ్లేషిస్తున్నానని నరేష్ స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన కొన్ని రాజకీయ అంచనాలు నిజమయ్యాయని గుర్తు చేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా గమనించాలని, భవిష్యత్తు పరిణామాల కోసం వేచి చూడాలని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
The major worry for the persons in the prashna issue & their legal teams
Should be that the UAPA can be filed from Any state other than the Telugu states as it is a central law and not a state law. What if the authorities from a state like Uttar Pradesh which Considers anti…— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 8, 2026


