Wednesday, July 15, 2026
HomeLATESTTV:షో మధ్యలో షాకింగ్ కామెంట్.."వాడిని బయటకి పంపేయండి" అంటూ జడ్జి ఫైర్..!

TV:షో మధ్యలో షాకింగ్ కామెంట్..”వాడిని బయటకి పంపేయండి” అంటూ జడ్జి ఫైర్..!

TV:స్టార్ మాలో ప్రసారమవుతున్న కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ కంటెస్టెంట్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన జడ్జి.. "వాడిని బయటికి పంపేయండి" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

on
- Advertisement -banner Ad

TV:స్టార్ మాలో ప్రసారమవుతున్న కుక్ విత్ జాతి రత్నాలు సీజన్ 2 ప్రేక్షకులను వినోదంతో ఆకట్టుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, అరుణా ముచ్చర్ల, కమెడియన్ అలీ, శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మల జడ్జిలుగా ఈ షోకు (TV) వ్యవహరిస్తున్నారు. వినూత్న థీమ్స్, సరదా టాస్కులు, కంటెస్టెంట్ల కామెడీ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పడంలో సందేహమే లేదు. తాజాగా విడుదలైన కొత్త ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది.

బోనాల వేడుకతో ప్రత్యేక ఎపిసోడ్:

ఆషాడ మాసం సందర్భంగా బోనాల పండుగ నేపథ్యంగా తీసుకొని ఈ వారపు ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. కంటెస్టెంట్లు, జడ్జీలు బోనం ఎత్తుకొని అమ్మవారిని ప్రార్థించడం బాగా ఆకట్టుకుంటోంది. సింగర్ మధుప్రియ ఆలపించిన బోనాల పాట కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో రాకింగ్ రాకేష్ చేసిన “ఈ ఆషాడానికైనా పప్పన్నం దొరుకుతుందా?” అనే ప్రశ్నకు అలీ ఇచ్చిన సరదా సమాధానాలు నవ్వులు పూయించాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Actress Indraja: పిలిచి మరీ అవమానిస్తారా.. కంటతడి పెట్టిన ఇంద్రజ!

బంధుత్వాల పేరుతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్:

ప్రదీప్ నిర్వహించిన ప్రత్యేక గేమ్‌లో స్లిప్పుల ద్వారా కంటెస్టెంట్లకు కొత్త బంధువులను పరిచయం చేశారు. ఆషికా పదుకొనేకు ఇంకో మామయ్యగా ముక్కు అవినాష్ రావడంతో ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను అలరించింది. పవన్‌కు బాబాయ్‌గా నూకరాజు వచ్చి గుండు మొక్క గురించి చెప్పడంతో పవన్ ఆశ్చర్యపోయాడు. తనుజాకు చెల్లెలుగా రీతూ చౌదరి రావడంతో పెళ్లి విషయంపై జరిగిన చర్చ నవ్వులు పూయించింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Mrunal Thakur:క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్..!

డాన్స్, పంచులు, టాస్క్‌లతో సందడి:

మణికంఠ, రాకింగ్ రాకేష్ చేసిన డాన్స్ కార్యక్రమానికి మరింత జోష్ తీసుకొచ్చింది. మణికంఠ ఓవర్ యాక్షన్‌పై ప్రదీప్, నూకరాజు, శ్రీదేవి విజయ్ కుమార్ వేసిన పంచులు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. “ఇతను అమ్మాయిలందరికీ ఏమవుతాడు?” అని పునర్నవి అడగగా, “అమ్మాయిలందరికీ తమ్ముడు వరస అవుతాడు” అని యాంకర్ ప్రదీప్ చెబుతాడు. అంతేకాదు, “నేను ఇప్పుడే ఫారిన్ నుంచి వచ్చాను” అని మణికంఠ బిల్డప్ ఇవ్వగా, యాంకర్ ప్రదీప్ సెటైర్ వేస్తాడు. ఇతని ఓవర్ యాక్షన్ చూసి, “ఇవన్నీ వద్దు కానీ ఒక రూ.5,000 ఇస్తాను… ఆయనను బయటికి పంపించేయండి” అని నూకరాజు అంటాడు. దీంతో వెంటనే జడ్జి శ్రీదేవి విజయ్ కుమార్, “నేను రూ.10,000 ఇస్తాను… ముందు అయితే పంపించేయండి” అంటూ చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోతారు. “పేమెంట్ కంటే ఎక్కువ… మరి చూసుకోండి, మనకంటే నూకరాజు టెంప్ట్ చేస్తున్నాడు” అంటూ మరోసారి సరదా కామెంట్ వినిపిస్తుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you