Thursday, July 16, 2026
HomeLATESTJana nayagan:విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ లాక్!

Jana nayagan:విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ లాక్!

Jana nayagan: సెన్సార్ సమస్యలన్నీ క్లియర్ చేసుకొని విజయ్ ఆఖరి సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

on
- Advertisement -banner Ad

Jana nayagan:తమిళనాడు సీఎం విజయ్ దళపతి చివరిగా నటించిన చిత్రం జననాయగన్. ఈ సినిమా తమిళనాడు ఎన్నికలకు ముందే విడుదల కావలసి ఉన్నప్పటికీ సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాలేకపోయింది. ఇక విజయ్ ఎన్నికలలో గెలిచి సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా విడుదల అవ్వడానికి ఆలస్యం అవుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చరిత్ర కోసం పోరాటం చాలా కఠినంగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది అంటూ చిత్ర బృందం పేర్కొంది.

జననాయగన్ రిలీజ్ డేట్ లాక్..

జననాయగన్(Jana nayagan) సినిమా జులై 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేర్లతో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక న్యూ పోస్టర్ అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. ఇందులో విజయ్ పోలీసు ఆఫీసర్గా కనిపిస్తూ, చేతిలో పొడవాటి కత్తి పట్టుకొని మరి నిలబడి ఉన్నట్టుగా చూపించారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Kannada Actors:రగ్గడ్ లుక్.. పవర్‌ఫుల్ నటన.. టాలీవుడ్‌లో కన్నడ విలన్లకు పెరుగుతున్న క్రేజ్!

ఎట్టకేలకు విడుదలకు సిద్ధం..

వాస్తవానికి 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల వల్ల చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యలో కోర్టు కేసులు విచారణ వంటి అడ్డంకులు కూడా వచ్చాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేసుకుంది . ఈ చిత్రానికి” ఏ” సర్టిఫికెట్ జారీ అయింది. సుమారుగా మూడు గంటల (183 నిమిషాల )నిడివితో ఈ సినిమా రాబోతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత జననాయగన్ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తామంటూ ప్రకటించారు. కానీ ఒకరోజు ముందుగా ఈ నెల 23వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:Shah Rukh Khan:ఒక ఇంటితోనే రూ.282 కోట్ల లాభం.. షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అదుర్స్..!

సీఎం అయిన తర్వాత తొలి మూవీ..

మరి విజయ్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ముఖ్యంగా విజయ్ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా.. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి తదితరులు కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అనిరుధ్ అందించడం గమనార్హం. అయితే ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రీమిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you