Tuesday, July 21, 2026
HomeLATESTJabardasth:జబర్దస్త్‌ లో షాకింగ్ మార్పు..ఇకపై ఆ రోజే టెలికాస్ట్.. ఈటీవీ అధికారిక ప్రకటన!

Jabardasth:జబర్దస్త్‌ లో షాకింగ్ మార్పు..ఇకపై ఆ రోజే టెలికాస్ట్.. ఈటీవీ అధికారిక ప్రకటన!

Jabardasth:తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ ప్రసార సమయాన్ని మార్చుకుంది.

on
- Advertisement -banner Ad

Jabardasth:తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాధరణ పొందిన కామెడీ షో లలో ఒకటైన జబర్దస్త్ కీలక మార్పుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు పదేలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ప్రసార సమయాన్ని మల్లెమాల ప్రొడక్షన్స్ మార్చేసింది. ఇకపై శుక్ర, శనివారాల రాత్రి కాకుండా ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు జబర్దస్త్ ప్రసారం కానుంది. ఈ కొత్త టైమింగ్ జూలై 26 నుంచి అమల్లోకి రానుంది అంటూ ఈటీవీ ప్రత్యేక ప్రోమో ద్వారా ప్రకటించింది.

వీకెండ్ స్లాట్ లోకి జబర్దస్త్ :

ఇటీవల వరకు జబర్దస్త్(Jabardasth) శుక్ర, శనివారాలలో రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యేది. అయితే కుటుంబ సభ్యులంతా కలిసి టీవీ చూసే ఆదివారం సాయంత్రం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని షోను వీకెండ్ స్లాట్ కు మార్చినట్లు తెలుస్తుంది. దీంతో మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించాలన్నది నిర్వాహకుల లక్ష్యంగా కనిపిస్తుంది .

- Advertisement -
Advertisement

ప్రసార సమయాలలో మార్పుల చరిత్ర :

2013లో ప్రారంభమైన జబర్దస్త్ మొదట గురువారం మాత్రమే ప్రసారమయ్యేది తర్వాత పెరిగిన ఆదరణతో జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ పేర్లతో గురు, శుక్రవారాలలో కూడా ప్రసారమయ్యేది. అనంతరం శుక్ర , శనివారాలకి మారిన ఈ షో ఇప్పుడు మరోసారి టైమింగ్ మార్చుకొని ఆదివారం స్లాట్ లో అడుగుపెడుతుంది.

also read:Anupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

- Advertisement -
Advertisement

హైపర్ ఆది రీ ఎంట్రీ తో కొత్త జోష్:

కొంతకాలంగా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ కమెడియన్ హైపర్ ఆది. మళ్ళీ షోలో కీలక పాత్ర పోషించనున్నాడు. కొత్త కాన్సెప్ట్లు, కొత్త టీమ్ కు మార్గ నిర్దేశం చేస్తూ ప్రేక్షకులను అలరించుకున్నట్లు సమాచారం. జడ్జిలుగా నాగబాబు , ఇంద్రజా కొనసాగుతూ ఉండగా యాంకర్ రష్మి గౌతమ్ తన ప్రత్యేక శైలిలో కార్యక్రమాన్ని ముందుకు నడిపించనుంది.

also read:Varun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

- Advertisement -
Advertisement

డిజిటల్ వ్యూహమే అసలు కారణమా ..?

ఈ మార్పు వెనక టెలివిజన్ రేటింగ్స్ తో పాటు డిజిటల్ వ్యూహం కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు వీకెండ్స్ లో ఓటిటి, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల్లో వినోద కార్యక్రమాల వీక్షణ గణనీయంగా పెరిగిపోతుంది. ఆదివారం టీవీలో ప్రసారమైన ఎపిసోడ్లను తర్వాత డిజిటల్ ప్లాట్ ఫార్ములాల్లో మరింత మంది వీక్షించే అవకాశం ఉండడంతో జబర్దస్త్ బ్రాండ్ టీవీ తో పాటు డిజిటల్ లోను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you