Tuesday, July 21, 2026
HomeLATESTChiranjeevi:చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..?

Chiranjeevi:చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..?

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ అందించేందుకు సిద్ధమయ్యారు.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన వర్గం ఉంది. ఆయన సినిమాలు విడుదలైన, పుట్టినరోజు వచ్చిన అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రక్తదానం ,అన్నదానం సామాజిక సేవా కార్యక్రమాలతో మెగా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్ అభిమానులకు ఓ ప్రత్యేక కానుక అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సీనియర్ అభిమానులకు ప్రత్యేక గుర్తింపు:

చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని చాలా కాలంగా అభిమాన సంఘాలలో సేవలందిస్తున్న వారిని గుర్తించి సత్కరించేందుకు అఖిల భారత చిరంజీవి యువత ముందుకు వచ్చింది. మూడు దశాబ్దాలుగా అభిమాన సంఘాల కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.

- Advertisement -
Advertisement

5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ :

అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి(Chiranjeevi) అభిమాన సంఘాల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్న సీనియర్ అభిమానులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.

also read:Anasuya: కలువ లాంటి కళ్ళతో ఆకట్టుకుంటున్న అనసూయ!

- Advertisement -
Advertisement

ఎవరికి ఈ అవకాశం ?:

గత మూడు దశాబ్దాలుగా థియేటర్ల వద్ద కటౌట్లు ఏర్పాటు చేయడం , పాలాభిషేకాలు నిర్వహించడం, పూలదండలు సమర్పించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ అభిమానులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆయా ప్రాంతాలలో అలాంటి అభిమానుల వివరాలు సేకరించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

also read:OTT:ఈ శుక్రవారం ఓటీటీలో అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే!

- Advertisement -
Advertisement

గుంటూరు నుంచి ప్రారంభం:

ఈ ప్రత్యేక కార్యక్రమానికి తొలి అడుగు గుంటూరు జిల్లా నుంచే వేయనున్నట్లు రవణం స్వామి నాయుడు తెలిపారు. అక్కడి నుంచి దశలవారీగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించినట్లు చెప్పారు. చిరంజీవి అభిమానుల సేవలకు గుర్తింపుగా తీసుకున్న ఈ నిర్ణయం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాబోతుండటం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఏకంగా ఈ సినిమా రూ .300 కోట్ల క్లబ్లోకి చేరింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రాలలో డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా, డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర, అలాగే శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేయబోతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you