Saturday, August 1, 2026
HomeLATESTRamayana Trailer:రామాయణ ట్రైలర్ లో ఆ ఇద్దరిని దాచేశారా?.. సోషల్ మీడియాలో భారీ చర్చ!

Ramayana Trailer:రామాయణ ట్రైలర్ లో ఆ ఇద్దరిని దాచేశారా?.. సోషల్ మీడియాలో భారీ చర్చ!

Ramayana Trailer:నితేష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. అయితే ట్రైలర్‌లో హనుమంతుడు, మండోదరి పాత్రలు కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

on
- Advertisement -banner Ad

Ramayana Trailer:గత కొన్ని రోజులుగా భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక్కే ఒక్క సినిమా ‘రామాయణ’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎంత మంది వెయిట్ చేశారో అందరికి తెలుసు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్(Ramayana Trailer) గురువారం బ్రహ్మముహూర్తంలో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తుంటే..మరికొంతమంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. కొందరు విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల ప్రదర్శనను ప్రశంసిస్తుండగా, మరికొందరు కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్‌పై మిశ్రమ స్పందన:

ట్రైలర్‌ చూసిన తరువాత చాలా మంది ఒక్కటే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. రావణుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, సీత పాత్రలో సాయిపల్లవి లుక్ ఆశించిన స్థాయిలో లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్‌లో కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ అధికంగా కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Sumanth: సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?

హనుమంతుడు కనిపించకపోవడంపై చర్చ:

ట్రైలర్ విడుదలైన తర్వాత ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం హనుమంతుడి పాత్ర లేకపోవడమే. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్రైలర్‌లో ఆయన ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామాయణ కథలో హనుమంతుడి పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో, ఉద్దేశపూర్వకంగానే ఈ పాత్రను ఇప్పుడే రివీల్ చేయలేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read:Niharika NM: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన నిహారిక!

కాజల్ అభిమానులకూ నిరాశ:

ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ట్రైలర్‌లో ఆమెకు సంబంధించిన ఒక్క షాట్ కూడా లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ పాత్ర పరిమిత నిడివి కలిగినదేనని కాజల్ గతంలోనే వెల్లడించినప్పటికీ, కనీసం ట్రైలర్‌లోనైనా ఆమెను చూపిస్తారని అభిమానులు ఆశించారు. దీంతో హనుమంతుడితో పాటు మండోదరి పాత్ర కూడా ట్రైలర్‌కు దూరంగా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కావాలనే ఆ ఇద్దరిని చూపించలేదా..? లేక ఏదైనా వేరే రీజన్ ఉందా..? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you