TV:బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె ప్రముఖ టెలివిజన్ (TV)నిర్మాత ఏక్తా కపూర్ మరోసారి తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని ప్రతిష్టాత్మక జూహూ ప్రాంతంలో ఉన్న ఏక్తా హౌస్ భవనంలోని ఒక ఫ్లోర్ను ఆమె నెలకు రూ.1.5 లక్షల అద్దెకు లీజ్ కి ఇచ్చారు. ఈ ఒప్పందం రెండేళ్ల కాలపరిమితితో కుదిరినట్లు ఆస్తుల నమోదు వివరాలు వెల్లడిస్తున్నాయి.
రెండేళ్ల లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం:
ఆస్తుల లావాదేవీలను విశ్లేషించే సంస్థ CRE Matrix ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2025 మార్చి 1 నుంచి ప్రారంభమైన లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. జూలై 28న ఈ అగ్రిమెంట్ అధికారికంగా రిజిస్ట్రేషన్ పూర్తయింది. నాలుగు అంతస్తుల భవనంలోని ఒక ఫ్లోర్ తో పాటు ఒక కార్ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దె ఒప్పందంలో చేర్చారు. ఒప్పంద కాలానికి సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్కులను అద్దెదారుడు ముందుగానే అందజేసినట్లు సమాచారం. జూహులోని ఇదే భవనంలో గతంలో కూడా ఏక్తాకపూర్ మరో ఫ్లోర్ను అద్దెకు ఇచ్చారు. 20201 లో నెలకు రూ.2.7 లక్షల అద్దెతో జరిగిన ఆ ఒప్పందంలో పది లక్షల సెక్యూరిటీ డిపాజిట్ 12 నెలల లాక్ ఇన్ పీరియడ్ వంటి నిబంధనలు కూడా ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను సమర్ధంగా ఉపయోగించడంలో ఈ కుటుంబం ప్రత్యేక గుర్తింపు పొందింది.
ALSO READ:Eesha rebba: పట్టు లెహంగాలో కుర్ర కారు మనసు దోచుకుంటున్న ఈషా రెబ్బ!
వందల కోట్ల ప్రాపర్టీ డీల్స్ :
2025లో జితేంద్ర కుటుంబం అంధేరీలోని 2.39 ఎకరాల స్థనాన్ని రూ.855 కోట్లకు ఎన్‌టిటి గ్లోబల్ డేటా సెంటర్స్ కు విక్రయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనంతరం వర్లీలోని ఓంకార్ 1973 టవర్ లో ఉన్న అపార్ట్మెంట్ ని 12.25 కోట్లకు విక్రయించారు. అంతకుముందు పూణే లోని స్థలాన్ని కూడా తమ సంస్థలకు బదిలీ చేస్తూ ఆస్తుల నిర్వహణలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జితేంద్ర దశాబ్దాల క్రితం ముంబై పాలి హిల్‌లోని ఒక బంగ్లాను కేవలం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అదే ఆస్తి విలువ రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పునర్నిర్మాణ సమయంలో బర్మా టీక్ కలప విక్రయించడమే తనకు కొనుగోలు ధర కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిందని జితేంద్ర గతంలో వెల్లడించారు. ఈ ఉదాహరణతో జితేంద్ర కుటుంబం సినీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బలమైన స్థానం ఏర్పరచుకున్నట్లు స్పష్టమవుతుంది..!!




