Monday, August 3, 2026
HomeLATESTTollywood:సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ!

Tollywood:సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ!

Tollywood:'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మృణాళిని రవి తన ప్రియుడు మహావిష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది.

on
- Advertisement -banner Ad

Tollywood:దక్షిణాది సినీ నటి మృణాళిని రవి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మలేషియా కు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె జీవితాన్ని పంచుకోబోతుంది. ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటూ కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

సన్నిహితుల మధ్య నిశ్చితార్థం:

మృణాళిని రవి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో నిశ్చితార్థ వేడుక సాదాసీదాగా జరిగింది అని తెలిపింది. అయితే పెళ్లి తేదీ వేదిక వంటి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మృణాళిని రవి – మహా విష్ణు గత ఏడేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నట్లు సమాచారం. కాలక్రమేన ఆ స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధం గా రూపుదిద్దుకొనుంది ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ లెనిన్ మూవీ.. ఎప్పుడంటే?

తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు:

మృణాళిని రవి 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. అనంతరం ‘ఛాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తెలుగులో(Tollywood) హీరో వరుణ్ తేజ్ నటించిన “గద్దల కొండ గణేష్” చిత్రంలో మృణాళిని రవి కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఆమె తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం ఆమె వివాహ వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపగా పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న నిశ్చితార్థ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Sirish :ఒక్కేఒక్క వీడియోతో స్టార్ హీరోయిన్స్ ని కూడా తొక్కిపడేసిన అల్లు శిరీష్ భార్య నయనిక..! 

https://www.instagram.com/p/Dbf65N7nyaO/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you