OTT:ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా అందనుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాలతో పాటు పలు హాలీవుడ్ యానిమేషన్లు.. అదేవిధంగా వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఆగస్టు 4 నుంచి 8 వరకు ప్రముఖ ఓటీటీ(OTT) వేదికలు కొత్త మూవీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. థ్రిల్లర్లు, డ్రామాలు, రొమాంటిక్ కథలు , యాక్షన్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ కూడా ఈ జాబితాలో ఉంది.
జియో హాట్ స్టార్ లో ఆసక్తికరమైన విడుదలలు :
ఆగస్టు 4న మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఉయిర్’ స్ట్రీమింగ్ కు రానుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో సహా పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఆగస్టు 6న 1980 లాస్ ఏంజల్స్ నేపథ్యంలో రూపొందిన డ్రామా సిరీస్ “ది షార్ట్స్” విడుదల కానుంది. అదే విధంగా ఆగస్టు 7న కుటుంబ ప్రేక్షకుల కోసం “ది సూపర్ మారియో గెలాక్సీ” మూవీ స్ట్రీమింగ్ లోకి రానుంది.
also read:Monday tv Movies:ఈరోజు టీవీల్లో ఫుల్ సందడే సందడి..
నెట్ఫ్లిక్స్ లో భారీ లైనప్:
నెట్ఫ్లిక్స్ ఈవారం విభిన్న శైలుల కంటెంట్ ను ముందుకు తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా తమిళ చిత్రం ‘ఇదయం మురళి’. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన “ఆపరేషన్ సఫేద్ సాగర్”.. అదేవిధంగా కొరియన్ రొమాంటిక్ డ్రామా ‘అవర్ స్టిక్కీ లవ్’, సర్వైవల్ థ్రిల్లర్ “ది లాస్ట్ హౌస్” ఆగస్టు 7న స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
also read:Ravi-Aarti:రవి-ఆర్తి విడాకుల కోర్టు తీర్పు..న్యాయమూర్తికి బిగ్ ధ్యాంక్స్..!
ప్రైమ్ వీడియో, జీ5లో కూడా కొత్త కంటెంట్:
ప్రైమ్ వీడియోలో ఆగస్టు 5న మిస్టరీ డ్రామా “స్టెర్లింగ్ పాయింట్”. ఆగస్టు 7న తమిళ థ్రిల్లర్ “వదంతి సీజన్ 2” విడుదల కానున్నాయి. ఇక జీ 5లో అఖిల్ అక్కినేని నటించిన తెలుగు చిత్రం “లెనిన్” ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో కూడా మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ వారం అన్ని ప్రధాన ఓటీటీ వేదికలు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉండడంతో ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఆస్వాదించాలనుకునే వారికి మంచి అవకాశంగా మారనుంది.




