Thursday, August 6, 2026
HomeLATESTTV:ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా..!

TV:ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా..!

TV:గురువారం బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది.సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు

on
- Advertisement -banner Ad

TV:గురువారం బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. కుటుంబ కథా చిత్రాలు , యాక్షన్ ఎంటర్టైనర్లు, అదేవిధంగా కామెడీ హిట్స్, ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు, ఇలా ఒకటారెండా అన్ని రకాల చిత్రాలను తెలుగు టీవీ(TV) ఛానళ్లు ప్రసారం చేయనున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ఛానల్లో ప్రసారమయ్యే సినిమాలతో సినీ అభిమానులు తమకు నచ్చిన చిత్రాన్ని హ్యాపీగా ఎంచుకొని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏ ఛానల్లో ఏ సినిమాలు ఎన్ని గంటలకి ప్రసారమవుతాయి అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం రండి ..!!

డీడీ యాదగిరి లో ప్రత్యేకమైన చిత్రాలు :

డీడీ యాదగిరి ఛానల్ లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ “బిఫోర్ ఐ వేక్” ప్రసారం కానుంది. ఇక మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ హీరో శ్రీకాంత్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఊరికి మొనగాడు” ప్రేక్షకులు ను అలరించునుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Preity Zinta:పదహారేళ్ల తర్వాత.. ప్రీతి జింటాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన బ్రెట్ లీ!

ఈటీవీ. ఈటీవీ సినిమాలపై ప్రత్యేక ఆకర్షణ:

ఇక ఈటీవీలో మధ్యాహ్నం మూడు గంటలకు, రాత్రి 10:30కు బాలకృష్ణ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ “సమరసింహారెడ్డి” ప్రసారం కానుంది. ఈటీవీ ప్లస్ లో మధ్యాహ్నం మూడు గంటలకు “బ్రో” మూవీ ప్రసారం చేయనున్నారు. ఈటీవీ సినిమాలో “శుభకార్యం” అదేవిధంగా “అబ్బాయిగారు అమ్మాయిగారు”, “పెళ్లి పీటలు”, “ప్రేమ సందడి”, “పల్నాటి సింహం”, “శివుడు శివుడు” వంటి చిత్రాలను వరుసగా ప్రసారం చేయనున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:RAAKA:అల్లు అర్జున్ “రాకా”లో అమ్మాయిల ఫేవరేట్ హీరో..?

జెమినీ ఛానల్ లో యాక్షన్ హిట్స్ :

జెమినీ టీవీలో ఉదయం “సాంబ” సినిమా అదేవిధంగా మధ్యాహ్నం “రచ్చ” ప్రసారం కానుండగా జెమినీ లైఫ్ లో “కొండవీటి సింహాసనం”, “తోడు నీడ” ప్రసారం కానున్నాయి. జెమిని మూవీస్ లో “భలే దొంగ”, “అల్లరి ప్రియుడు” , “వీరభద్ర”, “అతిథి”, “సై”, “బస్ స్టాప్” వంటి పలు చిత్రాలు వరుసగా టెలికాస్ట్ కానున్నాయి.

- Advertisement -
Advertisement

జీ తెలుగు స్టార్ మా ఛానల్ లో బ్లాక్ బస్టర్ :

జీ సినిమాల్లో “శైలజా రెడ్డి అల్లుడు”, “బలుపు”, “కాంచన 3”, “రాజకుమారుడు”, “జవాన్”, “సుబ్రహ్మణ్యపురం” ప్రసారం కానున్నాయి. ఇక స్టార్ మా లో “భరత్ అనే నేను”, స్టార్ మూవీస్ లో “షిరిడి సాయి”, ” ఐ”, “పొలిమేర 2″ సినిమాలు టెలికాస్ట్ అవుతాయి. స్టార్ మా గోల్డ్ లో ..”భగవతి”, “తెనాలి రామకృష్ణ”, “శుభలేఖ”, “యముడు” వంటి క్లాసిక్ మాస్ ఎంటర్టైనర్లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

మొత్తానికి ఈ గురువారం టీవీ ఛానల్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాత సినిమాలు అదేవిధంగా కొత్త సినిమాలు జనాలని ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు వరుసగా టెలికాస్ట్ కానున్నాయి. దీంతో సినీ అభిమానులకు వినోదానికి ఏమాత్రం కొరత ఉండదని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్ లో ప్రసారమవుతుందో ఎంపిక చేసుకొని చూసి ఎంజాయ్ చేయండి..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you