Sunday, August 9, 2026
HomeLATESTDC Movie review: డీసీ సినిమా రివ్యూ.. లోకేష్ కనగరాజ్ మెప్పించారా?

DC Movie review: డీసీ సినిమా రివ్యూ.. లోకేష్ కనగరాజ్ మెప్పించారా?

DC Movie review: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి సంజన ప్రధాన పాత్రల్లో వచ్చిన డిసి సినిమా రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

DC Movie review: మూవీ: డీసీ

నటీనటులు: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా తదితరులు నటించారు.

- Advertisement -
Advertisement

ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ అందించారు.

కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం: అరుణ్ మాతేశ్వరన్

- Advertisement -
Advertisement

స్టోరీ విషయానికి వస్తే.. సర్కార్ ముఠాలో దేవదాస్ (లోకేష్ కనకరాజ్) కీలక వ్యక్తిగా ఉంటారు. పోలీసుల ఆయుధాలను దొంగలించడమే వీళ్ళ పని. అయితే ఒక సామాన్యుడు తన కొడుకు చదువు కోసం దాచుకున్న 7 లక్షల రూపాయల కోసం పోలీసులు అతడిని దారుణంగా చంపి, ఆ డబ్బులను కాజేస్తారు. అలా జరిగిన అన్యాయానికి ప్రతికారంగా దేవదాస్ బృందం పోలీసుల పైన ఎదురు దాడి చేస్తుంది. దీంతో భోగరాజు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం వీళ్లపైన వేట మొదలు పెడుతుంది. ఆ సమయంలోనే గాయత్రీ పార్వతి (సంజన కృష్ణమూర్తి) దేవదాసుతో ప్రేమలో పడి దురదృష్టవశాత్తు పోలీసుల దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. దీంతో వేశ్యగా ఉన్న చంద్ర (వామికా గబ్బి) కు సహాయం చేసి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకు వస్తారు. పేదల కోసం చదువు హక్కు కోసం నాయకుడు సాగించిన పోరాటమే ఈ సినిమా కథ.

also read:Allu Arjun: AAA ఓపెనింగ్ కు అల్లు ఫ్యాన్స్ నో ఎంట్రీ..?

- Advertisement -
Advertisement

కథనం:

డైరెక్టర్ ఎంచుకున్న మార్గం చాలా షార్ట్.. మొదటి సీన్ నుంచే ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించేలా చిత్రాన్ని తీశారు. పైకి కేవలం క్రైమ్ డ్రామాలా చూపించినప్పటికీ.. లోపల మాత్రం బలమైన సామాజిక అంశాన్ని పేదలకు విద్యా హక్కును చర్చించుకునేలా చూపించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన పద్ధతి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో హీరో పెద్దగా డైలాగులు చెప్పరు. కేవలం తన కళ్ళతో హావ భావాలతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. పార్వతీతో నడిచే ప్రేమ అందరి హృదయాలను హత్తుకునేలా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్ కూడా హైలెట్ గా ఉంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ అద్భుతంగా తీశారు. ఎన్నో సినిమాలలో చూసిన కథ.. సమాజానికి ఎదురెళ్లే ఒక గ్యాంగ్ స్టార్.. సమాజం చేతుల్లో మోసపోయిన ఒక అమ్మాయి కలిసి చేసే ప్రయాణమే ఈ డీసీ సినిమా స్టోరీ. ఈ చిత్రానికి బిజిఎం హైలెట్గా నిలిచింది. అలాగే అమ్మాయిలను సేవ్ చేసే సీన్స్ కూడా హైలెట్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో చంద్ర పాత్ర కూడా సినిమాకి మరింత బలం. ఎక్కడ బోర్ కొట్టకుండా యాక్సిడెంట్ సీన్స్ ని చాలా వినూత్నంగానే తెరకెక్కించారు డైరెక్టర్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ సీన్స్, గన్స్ పట్టుకొని ఫైట్ చేసే విధానం కూడా ఆకట్టుకుంటుంది.

also read:Ritika Nayak:రితిక నాయక్‌కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..!

నటీనటులు:

దేవదాసు పాత్రలో లోకేష్ కనగరాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. కేవలం కెమెరా వెనుక మాత్రమే కాదు ముందు కూడా నటించగలరని నిరూపించారు. పార్వతీ పాత్రలో సంజన కృష్ణమూర్తి ఎంతో అందంగా కనిపించడమే కాకుండా తన నటనతో ఎమోషనల్ గా ఆకట్టుకుంది. చంద్ర పాత్రలో వామికా కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా నటించింది. ఇందులో నటించిన మిగిలిన పాత్రలు కూడా బాగానే నటించారు. డీసీ (DC Movie review)సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుధ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. ప్రతి యాక్షన్ సీన్స్, ప్రతి సీన్స్ దగ్గర సంగీతం మరో స్థాయికి తీసుకువెళ్లింది.

పంచ్ లైన్: ఓవరాల్ గా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మూవీ

రేటింగ్:3/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you