Saturday, August 8, 2026
HomeLATESTSreeLeela:బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల..!

SreeLeela:బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల..!

SreeLeela: ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల ఏకంగా సూపర్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

SreeLeela:టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళ వంటి భాషలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. కానీ వరుస సినిమాలలో నటిస్తోంది. ఆ మధ్యలో అఖిల్ నటించిన లెనిన్ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్గా శ్రీ లీల నటించినా.. కొన్ని కారణాల చేత వదిలేసుకుంది. దీంతో శ్రీ లీల క్రేజ్ తగ్గుతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలోని శ్రీలీల ఒక భారీ ప్రాజెక్టు చేసే అవకాశం అందుకున్నట్లు వినిపిస్తోంది.

రజనీకాంత్ సినిమాలో శ్రీ లీల..

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించబోతున్న ఒక చిత్రంలో శ్రీ లీల కీలక పాత్ర కోసం ఎంపిక అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ 173 వ చిత్రంగా వస్తున్న ధర్మాన్ చిత్రానికి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీ లీలా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. కమలహాసన్ రాజ్ కమల్ ఫిలిం బ్యానర్ పైన ఈ సినిమాను భారీ బడ్జెట్లోనే నిర్మించబోతున్నారు. శ్రీ లీల ఎంపిక పైన త్వరలోనే ఒక అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లు వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:DC Movie review: డీసీ సినిమా రివ్యూ.. లోకేష్ కనగరాజ్ మెప్పించారా?

రజినీకాంత్ మూవీ అయినా హిట్ ఇస్తుందా?

ఏడాది శ్రీ లీల(SreeLeel) నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే శివ కార్తికేయన్ సరసన నటించిన పరాశక్తి సినిమా కూడా పెద్దగా ఆడలేదు. వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న తరుణంలో శ్రీలీలకు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం రావడం అంటే అది నిజంగా శ్రీ లీలాకి అదృష్టమే అని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ సరసన చిత్రంలో నటిస్తున్నది ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకులందరికీ రాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun: AAA ఓపెనింగ్ కు అల్లు ఫ్యాన్స్ నో ఎంట్రీ..?

శ్రీ లీల అఫీషియల్ గా ప్రకటిస్తుందా?

కానీ రజనీకాంత్ ధర్మాన్ సినిమాలో రజనీకాంత్ డాక్టర్గా కనిపించబోతున్నారు. మరియు క్రేజీ పాత్రలో శ్రీ లీల ఎంపిక అయితే ఆమె పాత్ర ఏంటి అనే విషయంపై అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన శ్రీ లీల అఫీషియల్ గా స్పందిస్తుందేమో చూడాలి. శ్రీ లీల నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సినిమాలకు సంబంధించి గ్లామర్ ఫోటోలను కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీ లీల తన తల్లితో కలిసి అరుణాచలం దేవాలయానికి వెళ్ళిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you