Saturday, August 8, 2026
HomeLATESTVarun Tej:సీనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.

Varun Tej:సీనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు అంటూ వస్తున్న విమర్శలపై స్పందించారు.

on
- Advertisement -banner Ad

Varun Tej:మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఆగస్టు 7వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హర్రర్ కామెడీ తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా నాయక్ నటించగా, కమెడియన్ సత్య అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కూడా సినిమా పైన అంచనాలను పెంచేశాయి.

కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్..

ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాలోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఒక స్టార్ హీరో డైలాగులు వాడుకున్నారు. ఇటీవలే అందుకు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ గా మారింది. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన అమెచ్యూరిస్ అనే డైలాగ్ సినిమాలో ఉపయోగించారు. అయితే ఈ సినిమా పైన పలు రకాల ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన తాజాగా హీరో వరుణ్ తేజ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -
Advertisement

also read:Vishwanath and sons trailer:ఆకట్టుకుంటున్న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్..!

సోషల్ మీడియా ట్రోల్స్ పై వరుణ్ తేజ్ క్లారిటీ..

వరుణ్ తేజ్ (Varun Tej)మాట్లాడుతూ ..ఎన్టీఆర్ “అమెచ్యూరిష్ ను గత ఏడాది నవంబర్ నెలలో షూటింగ్ చేశాము ,మేము ఇమిటేట్ చేశాము. ట్రోల్ చేయలేదు .ఇమిటేట్ కు, ట్రోల్ కి చాల తేడా ఉంది .గతంలో కూడా నేను నటించిన F3 చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేశాము .సినిమా ప్రమోషన్లో కూడా చాల మంది హీరోలకు సంబంధించి డైలాగ్ లను ఇమిటేట్ చేశాము .చాల గొప్ప నటులను ఇమిటేట్ చేశాము. కానీ ఎప్పుడు ట్రోల్ చేయలేదు” వరుణ్ తేజ్ తెలియజేశారు .మాకు ఎప్పుడు కూడా అలంటి ఉద్దేశం లేదని తెలియజేశారు .మొత్తానికి SR .ఎన్టీఆర్ అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై హీరో వరుణ్ తేజ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Chandini chaudhary: క్యాస్టింగ్ కౌచ్ పై చాందిని చౌదరి సంచలన కామెంట్స్!

అసలేం జరిగిందంటే?

సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగపురుషుడు చిత్రంలోని డైలాగుని కమెడియన్ సత్య కొరియన్ కనకరాజు చిత్రంలో ఇమిటేట్ చేశారు. ఈ విషయం పైన అటు నందమూరి అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సమయంలో వరుణ్ తేజ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం సర్దుమణిగిందని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరికొద్ది గంటలలో కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎన్నికోట్ల రూపాయలు రాబట్టిందో అధికారికంగా తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఈ చిత్రంలోని పాత్ర చాలా విభిన్నంగా ఉందని అభిమానులు కూడా భావిస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you