Vijay Thalapathy: తమిళనాడు ముఖ్యమంత్రి సినీ హీరో విజయ్ , తన భార్య సంగీత విడాకుల కేసు వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో విజయ్ భార్య సంగీత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ విషయం సంచలనంగా మారింది. ఈ విడాకుల వ్యవహారంలో సంగీత తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. తన భర్తకు మరో హీరోయిన్ తో సంబంధం ఉందంటూ ఆమె పిటిషన్ లో కూడా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా గతంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ని వెనక్కి తీసుకోవడంతో ఇప్పుడు ఈ కేసులో మరొకసారి భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సంగీత – విజయ్ మధ్య విభేదాలు..
గత కొద్దిరోజులుగా విజయ్9Vijay Thalapathy), ఆయన భారీ సంగీత మధ్య వైవాహిక సంబంధిత విభేదాలు ఉన్నాయి అని.. గత కొద్ది సంవత్సరాలుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అయితే కొన్ని నెలలకు ఆ వార్తలను నిజం చేస్తూ సంగీత దాఖలు చేసిన పిటిషన్ మీడియాకు చిక్కడంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా తాము వేరువేరుగా జీవిస్తున్నామని, ఆయనకు సినీ తారతో సంబంధం ఉందంటూ, ఆ కారణం చేత తాను మానసిక, శారీరక క్షోభను కూడా అనుభవిస్తున్నారని సంగీత పిటిషన్ లో పేర్కొంది.
also read:Varun Tej:సీనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత..
విజయ్ తమిళనాడు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బిజీగా ఉండడం చేత.. అలాగే రాజకీయాల వల్ల విడాకుల పిటిషన్ పైన విచారణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఆగస్టు 7వ తేదీన చెంగల్పట్టు కోర్టులో వీడియో కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా తన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోబోతున్నట్లు కోర్టుకు తెలియజేసింది సంగీత. ఈ విషయం పైన కోర్టు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
also read:Vishwanath and sons trailer:ఆకట్టుకుంటున్న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్..!
చివరికి కథ సుఖాంతం..
సంగీత అభ్యర్థలను పరిగణలోకి తీసుకున్న కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో.. సంగీత తన విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంటానని, ఈ కేసును ఇంకా కొనసాగించడం ఇష్టం లేదని తెలియజేశారు ఈ నేపథ్యంలోనే విజయ్ తరుపున న్యాయవాదికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఆమె ఈ పిటిషన్ ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఇష్ట ప్రకారం పిటిషన్ విత్డ్రా చేసుకున్నారని భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సరే ఫ్రెష్ గా పిటిషన్ దాఖలు చేసుకునేలా సదుపాయం కల్పించినట్లు కోర్టు తెలుస్తోంది. మొత్తానికి విజయ్ సంగీత ఒకటి కాబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. ఇదే విషయంలో త్రిష పేరు కూడా మరొకసారి తెరమీదకి వినిపిస్తోంది.




