OTT:ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ దక్కించుకున్నాయి. యధావిధిగా ఈవారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం పలు ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్ లు , రియాలిటీ షోలు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 15వ వరకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ ఫైవ్, జియో హాట్ స్టార్, ఆహా, సన్ నెక్స్ట్ తదితర ఓటిటీలో మొత్తం 22 కొత్త కంటెంట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఓటీటీ (OTT)ప్రేక్షకులకు ఈవారం ఫుల్ వినోదం అనే చెప్పాలి. మరి ఎందుకు ఆలస్యం. ఏ ఓటిటిలో ..ఏ సినిమా రిలీజ్ అవుతుంది ..ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం రండి..!!
భారత భాగ్య విధాత:
బాలీవుడ్ నటి బిజెపి ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “భారత భాగ్య విధాత” ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 26/11 ముంబై ఉగ్ర దాడుల నేపథ్యంలో ఆసుపత్రిలో నర్స్ అందించిన సేవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది ఒక ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఆగస్టు 14 నుంచి జి 5 లో హిందీ తో పాటు తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు వెయిటింగ్ . అంతలా ఈ సినిమాలో ఎమోషనాలిటి ఉంటుంది.
also read:Tanuja :కుకు విత్ జాతిరత్నాలు” సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే?
వర్క్ ఫ్రం హోం:
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రం “మిస్టర్ వర్క్ ఫ్రం హోం” కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ విలేజ్ సోషల్ డ్రామ థియేటర్లలో మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ నుంచి స్రీమింగ్ కానుంది.
also read:Monday movies:సోమవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?
ఏ ఓటీటీలో ఏ కంటెంట్ :
నెట్‌ఫ్లిక్స్: ‘మిడ్ వింటర్ బ్రేక్’ (ఆగస్టు 10), ‘మారిన్హో’ (ఆగస్టు 11), రోరీ స్కోవెల్ (ఆగస్టు 11), ‘నాండో బిట్వీన్ టూ వరల్డ్స్’ (ఆగస్టు 12), ‘ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ (ఆగస్టు 13), ‘మై బ్రిలియంట్ కెరీర్’ (ఆగస్టు 13), ‘కాక్‌టెయిల్ 2’, ‘ఉమెత్తో’, ‘మై బెస్ట్ ఫ్రెండ్’ (ఆగస్టు 14) అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో: ‘ది ట్రెయిటర్స్’ సీజన్ 2 ఆగస్టు 13న స్ట్రీమింగ్ కానుంది.
జీ5: ‘భారత భాగ్య విధాత’, ‘నిబ్బా నిబ్బీ’ ఆగస్టు 14న విడుదల కానున్నాయి.
జియో హాట్‌స్టార్: ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ సీజన్ 3 ఆగస్టు 10న, ‘108 బేస్ హాస్పిటల్’ ఆగస్టు 15న రానున్నాయి.
ఆహా: ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె – USA’ ఆగస్టు 13న ప్రసారం కానుంది.
సోనీ లివ్: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 18 ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంటుంది.




