Tuesday, August 11, 2026
HomeLATESTRahul Sipligunj : బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. 16 మందిపై ఎఫ్‌ఐఆర్

Rahul Sipligunj : బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. 16 మందిపై ఎఫ్‌ఐఆర్

Rahul Sipligunj :ప్రముఖ సింగర్, ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో పోలీసు కేసు నమోదైనట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Rahul Sipligunj: టాలీవుడ్ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలోని “నాటు నాటు” పాటతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కగా.. ఆస్కార్ వేడుకల వేదికపై రాహుల్ సిప్లగంజ్ తన గాత్రంతో అలరించారు. అయితే ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విశాఖపట్నంలో నమోదైన ఓ కేసులో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పలువురి పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.

యువతి ఫిర్యాదుతో కేసు నమోదు:

ఎంవిపి పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్పూరపు రాహుల్ రెడ్డి మోసం చేశారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement

రాహుల్ సిప్లిగంజ్ పై యువతి ఆరోపణలు:

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాహుల్ రెడ్డి తనను ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో రాహుల్ సిప్లిగంజ్ అక్కడికి వచ్చినట్లు యువతి ఆరోపించింది. బంధువుగా పరిచయం చేసుకొని తనను బెదిరించారని తనతో బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను వైరల్ చేసి పరువుకు భంగం కలిగించారని ఆమె ఆరోపించినట్లు తెలుస్తుంది.

ALSO READ:Mega heros:విజయాలతో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరోస్!

- Advertisement -
Advertisement

పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు :

ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తో కలిపి మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు జర్నలిస్టులు , హైకోర్టు అడ్వకేట్ గీత ప్రసన్న చందన తదితరులను కలుపుకొని మొత్తం 16 మందిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.

యువతి ఫిర్యాదు ఆధారంగా బెదిరింపులు, సైబర్ వేధింపులు దళిత ఆరోపణలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు సమాచారం. తొలుత ఎంవిపి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా అనంతరం దర్యాప్తు కోసం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Mega heros:విజయాలతో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరోస్!

రాహుల్ స్పందన ఏంటి ?:

ఈ కేసు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. మరోవైపు ఈ వ్యవహారం పై రాహుల్ సిప్లిగంజ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇది ఇంకా బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాహుల్ నిజంగానే బెదిరించాడా..? ఆయనకి ఎందుకు ఆ అవసరం వచ్చింది..? అనే విధంగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాహుల్ సిప్లిగంజ్ దీనిపై ఎలా స్పందిస్తారు అనేది..???

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you