Kamakshi Bhaskarla :తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం చాలా తక్కువ అని, చాలామంది సెలబ్రిటీలో ఇప్పటికే తెలియజేశారు. ఇప్పుడు వారి బాటలోనే ప్రముఖ నటిగా పేరు సంపాదించిన కామాక్షి భాస్కర్ల కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న అగధ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామాక్షి ఎమోషనల్ గా మాట్లాడింది.
కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి భాస్కర్ల..
ఇండస్ట్రీలోకి వచ్చి తాను తొమ్మిదేళ్లు అయ్యిందని, తనకు ఇంత మంచి అవకాశం రావడానికి ఇన్నేళ్ల సమయం పట్టిందంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెస్ రాజుకి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యారెక్టర్ కోసం చాలా హోం వర్క్ కూడా చేశానని, నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని, అగధ జర్నీలో చాలామంది నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. నేను 2017 ఆగస్టులో ఇండియాకి వచ్చాను, అప్పటినుంచి లీడ్ రోల్ రావడానికి తనకు 9 ఏళ్లు పట్టింది . ఈ అవకాశం కేవలం ఎమ్మెస్ రాజు గారి వల్లే సాధ్యమైంది.
also read:MS Raju: సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని విషయం బయటపెట్టిన ఎంఎస్ రాజు..!
నన్ను నమ్మిన రాజు గారికి ధన్యవాదాలు..
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే చాలా తక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడిప్పుడే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో నాకు ఫిమేల్ లీడ్ గా సెంటర్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. అలాగే తన కుటుంబం కూడా తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, వారి వల్లే తనకి ఇలాంటి విజయం సాధ్యమైందని తెలిపింది. ఇంకో 10 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా తాను ఎమ్మెస్ రాజు గారి గురించి చెబుతానని తెలియజేసింది.
also read:Sandeep Reddy:పవన్ కల్యాణ్‌కు సందీప్ రెడ్డి వంగా దూరం..? ఫ్యాన్స్‌లో కొత్త అనుమానాలు!
అగధ 2కూడా..
ఎమ్మెస్ రాజు గారి నా కెరియర్ కి పునాది వేశారని చాలా గర్వంగా చెప్పుకుంటానని.. మేము చాలా కష్టపడి అగధ సినిమా చేసాము. అదే ప్రేమను ఆడియన్స్ తిరిగి ఇస్తారని ఆశిస్తున్నామంటూ కామాక్షి భాస్కర్ల చెప్పుకొచ్చింది.అలాగే అగధ2 సినిమాని కూడా కామాక్షి తోనే తీస్తానంటూ నిర్మాత ప్రకటించడం జరిగింది.
కామాక్షి కెరియర్..
కామాక్షి భాస్కర్ల ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసి కొంతకాలం పాటు ఇండియాలో అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగం వైపుగా అడుగులు వేసి, 2018 మిస్ తెలంగాణ టైటిల్ ను కూడా అందుకుంది. అదే ఏడాది మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్లిన కామాక్షి .. 2021లో ప్రియురాలు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే తనకి మాత్రం మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2, లైలా, తదితర చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి.




