Wednesday, August 12, 2026
HomeLATESTToxic:‘టాక్సిక్’లో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఇతడే!?

Toxic:‘టాక్సిక్’లో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఇతడే!?

Toxic:కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

on
- Advertisement -banner Ad

Toxic:కన్నడ స్టార్ హీరో యశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “టాక్సిక్”. ఇప్పుడు ఈ సినిమా గురించి ఫుల్ హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు జనాలు. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క ట్రైలర్ తోనే బాక్సాఫీస్ షేక్ చేసే రేంజ్ ఈ సినిమాకి ఉంది అంటూ సినీ స్టార్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఇలాంటి ఒక నటనను ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎవ్వరు చూపించలేదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్ . మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐదుగురు హీరోయిన్లతో యశ్:

టాక్సిక్(Toxic) లో యశ్ తో కలిసి ఐదుగురు హీరోయిన్లు నటించారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్ కు అభిమానుల నుంచి వేరే లెవెల్ స్పందన లభించింది. ముఖ్యంగా తండ్రి కొడుకులు గా యశ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారని వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

- Advertisement -
Advertisement

also read:Hero suriya:విశ్వనాథ్ అండ్ సన్స్ అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఎంత?

సూర్య రిజెక్ట్ చేశారు అంటూ ప్రచారం:

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాక్సిక్ సినిమాకు ముందుగా గీత మోహన్ దాస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అని అనుకున్నారట. ఈ సినిమా కథను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు దర్శక నిర్మాతలు వినిపించారు అని.. అయితే ఆయన ఈ ప్రాజెక్టుని సున్నితంగా రిజెక్ట్ చేశారు అని .. సినిమాలో భారీ యాక్షన్స్ సన్నివేశాలతో పాటు హద్దులు మించిన బోల్డ్ కంటెంట్ ఉండడమే దీనికి ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి . అనంతరం ఈ కథకు యశ్ ని ఎంపిక చేశారట చిత్ర నిర్మాతలు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా జరుగుతుంది.

- Advertisement -
Advertisement

also read:Jr NTR:జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ.. ఎప్పుడంటే..?

భారీ బడ్జెట్ తో టాక్సిక్ :

టాక్సిక్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీతో పాటు పలువురు విదేశీ నటీనటులు కూడా కనిపించనున్నారు. మొత్తంగా యశ్ అభిమానులు టాక్సిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ టాక్సిక్ సినిమా యశ్ కెరియర్ ని ఎలా మలుపు తిప్పుతుంది..? ఆయన సినీ లైఫ్ కి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది..? ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you