Tuesday, August 18, 2026
HomeLATESTYash: ఏడు సినిమాలను వదులుకున్న యశ్ !

Yash: ఏడు సినిమాలను వదులుకున్న యశ్ !

Yash: ప్రముఖ స్టార్ హీరో యశ్ ఏకంగా 7 సినిమాలను వదులుకున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Yash: కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ముఖ్యంగా తన సినీ కెరియర్ కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. యశ్ ( Yash)మాట్లాడుతూ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో మంచి గుర్తింపు వస్తున్న సమయంలో ఏకంగా ఏడు చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చాయని తెలిపారు.

అలా చేయడం నాకు ఇష్టం..

కానీ ప్రతి సినిమా విషయంలో తాను ముందు స్క్రిప్ట్ ఇవ్వాలని చెప్పడంతో టీవీ నటుడు స్క్రిప్ట్ అడగడం ఏంటి అంటూ చాలామంది డైరెక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, కానీ తాను మాత్రం స్టోరీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదని తెలియజేశారు. నేను ఏ పాత్ర చేసినా కూడా దాన్ని ఆస్వాదించాలి. ఆ పాత్ర నాకు నచ్చితేనే ప్రేక్షకులకు ఎలా నచ్చేలా చూపించగలనో తనకి అర్థం అవుతుందని, తాను చేసే పనిలో నిజాయితీ ఉండాలి, ఆ తర్వాత ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది మాత్రం అది వేరే విషయం కానీ మనం మాత్రం నమ్మకంతో ప్రాణం పెట్టి పని చేయాలంటూ తెలిపారు యశ్.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss:”బిగ్ బాస్‌లో గిఫ్టుల పేరుతో మోసం”..మనసులోని బాధని కక్కేసిన పల్లవి ప్రశాంత్..!

ఏకంగా ఏడు సినిమాలు కోల్పోయా..

స్క్రిప్ట్ విషయంలో తాను పట్టు పట్టడం వల్లే ఏడు సినిమాలు చేతిలో నుంచి జారిపోయాయని, వాటిని కోల్పోయినందుకు ఎప్పుడు కూడా బాధపడలేదు. అలాగే సినిమా పారితోషకం విషయంలో కూడా తాను ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తున్నానని తెలియజేశారు. తను మార్కెట్ వ్యాల్యూకు అనుగుణంగానే పారితోషకం ఉంటుందని నిర్మాత నుంచి ముందుగానే భారీ మొత్తాన్ని తీసుకొని సినిమా రిజల్టు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం తనకి ఇష్టం ఉండదని.. కే జి ఎఫ్ ముందు నుంచి నిర్మాతలతో భాగస్వామి పద్ధతిలో పనిచేశానంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:రహస్యాలు, కోరికలు, సంబంధాలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘డార్క్ సీక్రెట్స్’..!

కే జి ఎఫ్ చిత్రాలపై కామెంట్..

నిర్మాతలు ఎంత రిస్క్ తీసుకుంటే తాను కూడా అంతే రిస్క్ కి తీసుకోవాలనేదే తన విధానమని, సినిమా సక్సెస్ సాధించి లాభాలు వస్తే అందులో తన వాటా ఉండాలి. అదే సినిమా నష్టపోతే ఆ నష్టంలో కూడా బాగా ఉండాలనే సిద్ధాంతాన్ని కలిగి ఉన్నానని తెలిపారు.. కే జి ఎఫ్ రెండు భాగాలు సక్సెస్ పైన మాట్లాడుతూ.. ఈ సినిమా తన ప్రస్తుత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్ అని అయినప్పటికీ ప్రేక్షకులను సినిమా అద్భుతంగా అందించామని వెల్లడించారు. తమకు ప్రేక్షకుల బలమే అతిపెద్ద నమ్మకమని ఒకప్పుడు తనని విమర్శించిన వాళ్ళు సైతం తన పని నచ్చి అభిమానులుగా మారుతున్నారని తెలిపారు. అందుకే తాను ఎప్పుడూ కూడా ప్రేక్షకుల కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు యశ్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you