Sai Dharam Tej:స్టార్ సెలబ్రిటీస్ ఏ పని చేసినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అది మంచి పని అయినా, చెడు పని అయినా.. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ హీరోలైనా సరే చిన్న విషయం కారణంగా సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతానికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి చిక్కులు ఎదుర్కొంటున్నాడు మెగా హీరో సాయి దుర్గా తేజ్. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా హీరో అయిన సాయి దుర్గా తేజ్ ఆలయ ప్రాంగణంలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి పుట్టినరోజు వేడుకలపై..:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీ అని అందరికీ తెలిసిందే. ఆరోజు పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫ్యాన్స్. ఆరోజు చిరంజీవి కేక్ కట్ చేసినా, చేయకపోయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఎక్కడున్నా సరే సందడి సందడి వాతావరణం మధ్య కేక్ కట్ చేస్తూ ఉంటారు. చిరంజీవి పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఈ వేడుకను ఉద్దేశించి సాయి తేజ్ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కాణిపాకం ఆలయంలో సాయి దుర్గా తేజ్..:
పూర్తి వివరాల్లోకి వెళితే.. మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej)కాణిపాకం ఆలయానికి వెళ్లారు. కాణిపాకం ఆలయానికి చెందిన వసతిగృహంలో తన అభిమానులతో సమావేశం అయ్యారు. అనంతరం ఈ సందర్భంగా చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కేక్ కట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వేగంగా ట్రెండ్ అవుతున్నాయి.
also read:Irumudi:ఇరుముడి సినిమాలో ఆ 40 నిమిషాలే హైలెట్..!
భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత..:
అయితే దీనిపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం ఏంటి? మెగా హీరోవి.. ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం సెన్స్ లేదా? అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరికొంతమంది భక్తులు మాత్రం వెంటనే సాయి దుర్గ తేజ్, అభిమానులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణానికి నిలయమైన పుణ్యక్షేత్రంలో వ్యక్తిగత సంబరాలకు చోటు కల్పించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెద్ద హీరో కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇలా చేయడం ఇంకా పెద్ద సెన్సేషన్‌గా మారిపోయింది.
also read:Anasuya:యాంకర్ అనసూయ పై పోలీస్ కేసు..!
ఆలయ అధికారుల తీరుపై ప్రశ్నలు..:
సాధారణ భక్తులకు కఠినమైన నిబంధనలను అమలు చేసే ఆలయ అధికారులు ప్రముఖుల విషయంలో ఎందుకు ఇలా చూసీచూడనట్లు గాలికి వదిలేస్తున్నారు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆలయ గెస్ట్‌హౌస్‌లో ఇలాంటి కార్యక్రమానికి ఎలా అనుమతిస్తారు? అంటూ ఆలయ పాలకమండలి, అధికారుల తీరును కూడా తప్పుపడుతున్నారు. వెంటనే సాయి దుర్గ తేజ్ దీనిపై స్పందించి భక్తులకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సాయి దుర్గా తేజ్‌కు కొందరి మద్దతు..:
మరికొంతమంది మాత్రం సాయి తేజ్‌కు అండగా నిలుస్తున్నారు. ఆయన ఆలయంలో కాకుండా కేవలం గెస్ట్‌హౌస్‌లో మాత్రమే కేక్ కట్ చేశారని, అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదని అంటున్నారు. దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? కావాలనే మెగా ఫ్యామిలీని తప్పుపట్టడానికి ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో పవిత్రత, సంప్రదాయాల పరిరక్షణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై ఆలయ అధికారులు లేదా మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది..!!




