Tuesday, August 18, 2026
HomeLATESTDhruv Vikram: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన ధ్రువ్ విక్రమ్..!

Dhruv Vikram: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన ధ్రువ్ విక్రమ్..!

Dhruv Vikram: విక్రమ్ చియాన్ వారసుడు, ప్రముఖ హీరో ధ్రువ్ విక్రమ్ తొలిసారి తన బ్రేకప్ పై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

on
- Advertisement -banner Ad

Dhruv Vikram: సినీ పరిశ్రమలో సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్సు, వివాదాలు అనేవి వినిపిస్తూ ఉంటాయి. కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ , టాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒకే చోట తిరగడం , ఫోటోలు షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇటీవలే అనుపమ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయడంతో లవ్ బ్రేకప్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి.

పేరు చెప్పకుండా టాక్సిక్ రిలేషన్ అంటూ చెప్పిన అనుపమ..

అంతేకాకుండా అనుపమ తాను గత కొన్ని నెలలుగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నానని , తీవ్ర మానసిక క్షోభను అనుభవించానంటూ తెలియజేసింది. అంతేకాకుండా అవతలి వ్యక్తి ప్రతి చిన్న విషయాన్ని కూడా తన కెరియర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం కూడా చేశారని పేరు చెప్పకుండా ప్రస్తావించింది. ఈ అనుభవాల వల్ల తాను తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం అనారోగ్య సమస్యలు వంటివి ఎదురయ్యాయని బరువు కూడా భారీగా తగ్గిపోయాను అంటూ ఆవేదనతో తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Shrasti Verma:పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ!

అందుకే లవ్ బ్రేకప్ అంటూ ఎమోషనల్ కామెంట్..

అంతేకాకుండా తన కెరీర్లు మరోసారి మంచి విజయాన్ని అందించిన డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తాను పాల్గొనలేకపోయానని ఎన్నో మంచి సినిమా అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపింది అనుపమ. ఈ విషయాలు విన్న అభిమానులు సైతం ధ్రువ్ విక్రమ్(Dhruv Vikram) అనుపమాని అంతలా ఇబ్బంది పెట్టారా అనే వార్తలు వైరల్ గా మారాయి. అందుకే అనుపమ తన లవ్ కి బ్రేకప్ చెప్పిందనే విధంగా మరింత రూమర్స్ వినిపించాయి. ఈ విషయం పైన ధ్రువ్ విక్రమ్ తాజాగా తనపైన వస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ పైన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

- Advertisement -
Advertisement

also read:OTT:కొరియన్ కనకరాజు”కు అదిరిపోయే ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్పందించిన ధ్రువ్ ..

చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాల పైన పరిశీలనలు విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని నన్ను ఇవన్నీ అస్సలు బాధించలేవని, ఇవి నాపైన ఎలాంటి ప్రభావం చూపించలేదని కూడా తెలిపారు. జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలబడడం , వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు మన విలువలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేనా ఈ దుష్ప్రచారాలు విమర్శలు అన్నీ కూడా సమీసిపోతాయంటూ తెలిపారు ధ్రువ్ విక్రమ్. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన అభిమానుల మద్దతే తనని ముందుకు నడిపిస్తోందంటూ తెలియజేశారు. మొత్తానికి ధ్రువ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇకనైనా ఈ విషయాలకు పుల్ స్టాప్ పెడతారేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you