Mokshagna:సినిమా ఇండస్ట్రీలో ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అనుష్క–ప్రభాస్‌ల పెళ్లి రూమర్. ఆ తర్వాత అంత రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు నాలుగేళ్ల నుంచి ‘అదిగో బాలయ్య కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు.. ఇదిగో ఈ డైరెక్టర్ దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. మోక్షజ్ఞను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఇతడే’ అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
టాప్ డైరెక్టర్ల పేర్లు:
కొందరేమో ప్రశాంత్ వర్మ అని, కొందరేమో డైరెక్టర్ క్రిష్ అని, మరికొందరు త్రివిక్రమ్ అని.. ఇంకొక డైరెక్టర్ పేరు ఇలా ఒకటా రెండా.. తెలుగు ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ డైరెక్టర్ల పేర్లు మొత్తం రూమర్స్‌లో వినిపించాయి. కొన్ని సార్లు అయితే సినిమా షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నట్లు మాట్లాడుకున్నారు. మరికొందరు హీరోయిన్ గా శ్రీలీల ఫిక అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా ఓ సెన్సేషనల్ విషయం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట.
వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా?:
నందమూరి నట వారసుడు బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ(Mokshagna) సినీ అరంగేట్రం ఎట్టకేలకు ఖాయం అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండ్ అవుతుంది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది అంటూ సినీ వర్గాల నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా స్టోరీ కూడా రెడీ అయిపోయిందట. బాలయ్య విని ఇంప్రెస్ అయిపోయారట. మోక్షజ్ఞ కూడా ఈ స్టోరీ కోసం తన బాడీ మేకోవర్‌ను చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ ఇది కన్ ఫామ్ అంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ:OTT:బర్త్‌డే పార్టీ అంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న సినిమా..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్..!
దసరాకు గ్రాండ్ లాంచ్?:
రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. నందమూరి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ప్రకటన ఆలస్యం అయినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ దసరా సందర్భంగా ఈ మూవీ గ్రాండ్ లాంచ్ జరగనున్నట్లు తెలుస్తుంది.
ALSO READ:Anupama:మహిళగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేశాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ షాకింగ్..!
కీలక పాత్రలో బాలయ్య?:
అంతేకాదు, బాలయ్య కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అంతా సవ్యంగా జరిగితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరగా దీనికి సంబంధించి అఫీషియల్ టెక్నిక్ వస్తే బాగుంటుంది అంటూ ఆశ పడుతున్నారు. చూడాలి మరి.. దీనిపై బాలయ్య లేదా చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అనేది..




