Thursday, August 20, 2026
HomeLATESTOTT:ఘట్టమనేని జయకృష్ణ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?

OTT:ఘట్టమనేని జయకృష్ణ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?

OTT:ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

on
- Advertisement -banner Ad

OTT:మనందరికీ తెలిసిందే.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడిగా ఘట్టమనేని జయకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ కటౌట్ చూసి పెద్ద స్టార్ హీరో రేంజ్‌లో వెళ్లిపోతాడు అని అంతా అనుకున్నారు. కటౌట్ బాగానే ఉన్నా.. లోపల కంటెంట్ లేదు అంటూ కొంతమంది ఆయన నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఘాటుగా ట్రోలింగ్‌కి గురి చేశారు. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయమైంది.

అజయ్ భూపతి దర్శకత్వంలో:

ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇంతకుముందే ఆయన ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాలతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలాంటి కాంబోలో సినిమా వస్తుంది అని తెలిసి జనాలు ఫుల్ ఖుషీ అయ్యారు. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా జనాలను ఆకట్టుకుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా పరిస్థితి తలకిందులైపోయింది. అసలు ఇది సినిమానేనా అంటూ సొంత ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. కంటెంట్ లేదు అంటూ ఘాటుగా ట్రోలింగ్‌కి గురి చేశారు.

- Advertisement -
Advertisement

అట్టర్ ప్లాప్‌గా నిలిచిన సినిమా:

అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా సినిమా ఇండస్ట్రీలో అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రొటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు కూడా రాలేకపోయాయి. అయితే మాస్ ఆడియన్స్‌కి మాత్రం కొంచెం అంశాలు ఉండడంతో కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ALSO READ:Ticket price:తెలంగాణలో టికెట్ల ధరలు పెంపు..!

- Advertisement -
Advertisement

20 రోజులకే ఓటీటీలోకి:

థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజులకే ఈ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఓటీటీ(OTT)లోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ALSO READ:Pavithra Gowda:నటి పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలు కారణం ఇదేనా?

- Advertisement -
Advertisement

తిరుపతి నేపథ్యంలో కథ:

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది టోటల్‌గా తిరుపతి నేపథ్యంలో తెరకెక్కింది. ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఈ సినిమాను హ్యాపీగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you