Nainisha Rai:నైనీషా రాయ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగు బుల్లితెరపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా ‘అప్పు’ అనే క్యారెక్టర్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడటం, టామ్‌బాయ్ లాంటి లుక్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం, ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడం చకచకా జరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్‌కు మించిన రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ముందుకు వెళ్తుంది నైనీషా రాయ్. ఆమె కెరీర్, ఆమె లైఫ్, ఎలా సీరియల్స్‌లోకి వచ్చింది అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగాలీ కుటుంబంలో జన్మించిన నైనీషా :
నైనీషా పూర్తిగా బెంగాలీ అమ్మాయి. చిన్నతనం నుంచే ఆమెకు యాక్టింగ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆ కారణంగానే ఆమె చదువుతోపాటు యాక్టింగ్ వైపు కూడా అడుగులు వేసింది. కుటుంబ సభ్యులు మొదట్లో నో చెప్పారు. కానీ ఆమెకు మాత్రం తన ఫీల్డ్‌పై ఉన్న ఇంట్రెస్ట్ అసలు తగ్గలేదు. కుటుంబం నుంచి రావాల్సిన మద్దతు రాకపోయినా ధైర్యంగా, నిజాయితీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తానేంటో ప్రూవ్ చేసుకుంది నైనీషా.
ఇంటర్మీడియట్లోనే ఇండస్ట్రీలోకి:
నైనీషా(Nainisha Rai) ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడం అందరికీ షాకింగ్‌గా అనిపించింది. సాధారణంగా లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఇలా ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ నైనీషా మాత్రం చదువుకుంటూనే మరో పక్క ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్‌లో అందరి అమ్మాయిల మాదిరిగానే అవకాశాల కోసం బాగా ఇబ్బందులు పడిందట. మనీ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేసిందట. ఎన్నో సవాళ్లను ఎదుర్కొందట. ఆ తర్వాత ఫైనల్లీ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్ ద్వారా మంచి క్యారెక్టర్లో ఆమె మెరిసింది. దీంతో ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు.
ALSO READ:Eshwar Sai:మాధురిపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి షాకింగ్ కామెంట్స్!
వరుసగా సీరియల్స్‌లో అవకాశాలు:
ఇక వరుసగా తెలుగు సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకుంది ఈ అమ్మడు. ‘బ్రహ్మముడి’ సీరియల్లో హీరోయిన్‌కు చెల్లెలుగా, టామ్‌బాయ్ గెటప్‌లో అదిరిపోయే నటనను చూపిస్తుంది. ఇక ‘వంటలక్క’ సీరియల్లో అయితే ‘ధారా’ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మెరిసి తానేంటో ప్రూవ్ చేసుకుంది. అదేవిధంగా పలు సీరియల్స్‌లో నటిస్తూ తన ఇమేజ్ను ఒక్కో రేంజ్‌కు మార్చేసింది.
ALSO READ:Vishwanath and sons:విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..!
నైనీషా రెమ్యూనరేషన్ ఎంతంటే?:
ఆమె రెమ్యూనరేషన్ అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటుందట. రోజుకు ఒక నాలుగు ఎపిసోడ్లు చేసినా ఆదాయం ఈజీగా లక్ష రూపాయలు దాటేస్తుంది. రోజుకు లక్ష రూపాయలు అంటే ఓ హీరోకి మించిన సంపాదన అని అనుకోక తప్పదు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇక నైనీషా పర్సనల్ లైఫ్, అలాగే సీరియల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు.




