Monday, August 24, 2026
HomeLATESTMahakali Movie:మహాకాళి సినిమా నుంచి గ్లింప్స్ వైరల్!

Mahakali Movie:మహాకాళి సినిమా నుంచి గ్లింప్స్ వైరల్!

Mahakali Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు మహాకాళి మూవీ రాబోతుండగా.. ఈ చిత్రం నుండి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Mahakali Movie:టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హను-మాన్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా చిత్రం మహాకాళి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూజా కొల్లూరు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమా నుంచి తాజాగా శుక్రాచార్యుడి వార్ క్రై పేరుతో ఈరోజు ఒక అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా చేస్తోంది.

మహాకాళి గ్లింప్స్ రిలీజ్..

మహాకాళి(Mahakali Movie) సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అంచనాలను పెంచేసింది.. తాజాగా విడుదలైన గ్లింప్స్ విషయానికి వస్తే.. అమృత మథన సమయంలో దేవతలతో సమానంగా శ్రమించినా.. విష్ణువు అమృతాన్ని కేవలం దేవ గణానికే ప్రసాదించాడు.. ఇది ధర్మమా? అధర్మమా? అంటూ అక్షయ్ ఖన్నా చెప్పే డైలాగ్ , ఎంట్రీ సీన్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచేసిందని చెప్పవచ్చు. 14 లోకాల ద్వారాలను తెరిచి అసురులకు శాశ్వత విముక్తి కల్పించాలంటే రక్త బిజుడిని మేల్కొల్పి మానవజాతి పైన యుద్ధాన్ని పురిగొల్పే సీన్స్ మరింత ఆకట్టుకునేలా చూపించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Nainisha Rai:బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ స్టోరీ..నైనిషా రాయ్ షాకింగ్ జర్నీ!

గూస్ బంప్స్ తెప్పిస్తోన్న గ్లింప్స్..

అక్షయ్ ఖన్నా ఇంటెన్స్ లుక్, రాక్షస గురువుగా ఆయన స్వాగ్ అన్నీ కూడా హైలెట్గా నిలిచాయి. చివరిలో ఒడిలో పసిబిడ్డను లాలిస్తూ ఉగ్రరూపం దాల్చి.. ఆయుధాలతో దర్శనమిచ్చే మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి లుక్ కూడా హైలెట్గా కనిపించింది. ఇక చివరిలో పెద్దమ్మ చూస్తుంది రా! అంటూ వచ్చే టైటిల్ వాయిస్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. అమ్మవారిగా శ్రియా రెడ్డిని చూపించిన తీరు కూడా ఎవరు ఊహించలేదు. చాలా చక్కగా చూపించడమే కాకుండా ఆమె కనబడిన తీరు కూడా నిజంగా అందరిని ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Eshwar Sai:మాధురిపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి షాకింగ్ కామెంట్స్!

విడుదల ఎప్పుడంటే?

ఓవరాల్ గా ప్రశాంత్ వర్మ విజన్ హాలీవుడ్ స్థాయిని మించి మరి ఎఫెక్ట్ ఉన్నట్లు కనిపిస్తోంది. 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ త్రీడీలో ఈ సినిమా రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో చాలా గ్రాండ్ గానే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో ప్రశాంత్ వర్మ చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి గ్లింప్స్ వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జాంబీ రెడ్డి 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమాని కూడా డైరెక్షన్ చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you