Saturday, September 5, 2026
HomeLATESTBethlehem Kudumba Unit:‘బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Bethlehem Kudumba Unit:‘బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Bethlehem Kudumba Unit:మమితా బైజు, నివిన్‌ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌’ పూర్తి మూవీ రివ్యూ .

on
- Advertisement -banner Ad

Bethlehem Kudumba Unit:మమితా బైజు మరోసారి తన నటనతో ఆకట్టుకుంటున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌’(Bethlehem Kudumba Unit) మలయాళంలో ఘన విజయం సాధించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీని ఇప్పుడు తెలుగులోకి డబ్‌ చేసి శుక్రవారం (సెప్టెంబర్‌ 4) తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఈ సినిమా రివ్యూ చూద్దాం.

ఆష్లే (మమితా బైజు) కాలేజీ విద్యార్థిని. గిటార్ వాయించడం ఆమెకు ఇష్టం. కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి మారిన తర్వాత పక్కింట్లో ఉండే జస్టిన్ (నివిన్ పౌలీ)తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఒంటరిగా జీవించే జస్టిన్‌తో ఆష్లే స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కారణంగా కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని అంగీకరించరు. దీంతో వారి ప్రేమకు బ్రేక్ పడుతుంది. ఆష్లే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోతుంది. కొంతకాలం తర్వాత ఓ పెళ్లి కోసం స్వస్థలానికి తిరిగి వచ్చిన ఆమె జీవితంలో జస్టిన్ మళ్లీ ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వారి బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? కుటుంబం అడ్డంకులను దాటుకుని వారి ప్రేమ గమ్యానికి చేరిందా? అనేది తెరపై చూడాలి.

- Advertisement -
Advertisement

విశ్లేషణ :

ఏజ్ గ్యాప్ ప్రేమకథను కుటుంబ అనుబంధాలు, కామెడీ, భావోద్వేగాలతో మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆష్లే గతాన్ని గుర్తు చేసుకునే విధానంలో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆమె కుటుంబం, జస్టిన్ వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యే విధానం రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది.

ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్, కామెడీ, పంచ్ డైలాగ్స్ సినిమాను సరదాగా నడిపిస్తాయి. జస్టిన్ తమ్ముడి షార్ట్ ఫిల్మ్ వ్యవహారం మంచి నవ్వులు పంచుతుంది. సెకండాఫ్‌లో కథ భావోద్వేగాల వైపు మళ్లుతుంది. ప్రేమకు కుటుంబం నుంచి ఎదురయ్యే వ్యతిరేకత, బ్రేకప్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఏజ్ గ్యాప్‌పై వచ్చే కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది. అయితే సినిమా నిడివి ఎక్కువగా అనిపించడం, కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే మరింత బాగుండేదనే భావన కలుగుతుంది. అన్ని చోట్ల కామెడీ సమానంగా పండకపోయినా, సహజమైన హాస్యం సినిమాకు ప్లస్‌గా నిలిచింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Sivaji :ఓటీటీలో సినిమాలు చూసేవారు సోమరిపోతులు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

జస్టిన్‌గా నివిన్ పౌలీ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ప్రేమికుడిగా, భావోద్వేగాలను లోపల దాచుకునే పాత్రలో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అతని నటన ఆకట్టుకుంటుంది.

- Advertisement -
Advertisement

ఆష్లేగా మమితా బైజు సహజంగా నటించింది. ఫన్నీ సన్నివేశాలతో పాటు ప్రేమ, కుటుంబం, భావోద్వేగాలకు సంబంధించిన సీన్లలోనూ తన మార్క్ చూపించింది. నివిన్, మమితా మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. జస్టిన్ తమ్ముడిగా సంగీత్ ప్రతాప్ కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిలో మెప్పించారు.

ALSO READ:Duniya Vijay:భార్యతో విడాకులు తీసుకున్న దునియా విజయ్..!

టెక్నికల్ టీం :

దర్శకుడు గిరీష్ ఏడీ ఎంచుకున్న కథ ఆసక్తికరంగా ఉంది. కథలోని ఫన్, లవ్, ఎమోషన్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశాడు. విష్ణు విజయ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ఫీల్‌గుడ్ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అజ్మల్ సాబు కెమెరా పనితనం విజువల్స్‌ను మరింత అందంగా మార్చింది. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌లో మాత్రం మరింత కత్తెర పడాల్సింది.

ప్లస్‌లు :

*నివిన్ పౌలీ, మమితా బైజు నటన

*హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ

*సహజమైన కామెడీ

*ఫీల్‌గుడ్ లవ్ ట్రాక్

*సంగీతం, విజువల్స్

*కుటుంబంతో చూడదగిన కంటెంట్

మైనస్‌లు :

*కొన్ని చోట్ల ల్యాగ్

*ఎక్కువ నిడివి

*అన్ని కామెడీ సన్నివేశాలు సమానంగా పేలలేదు

పంచ్ లైన్ :

ఏజ్ గ్యాప్ ప్రేమకు ఫ్యామిలీ కామెడీ తోడైతే.. ‘బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్’ ఓ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

రేటింగ్: 3/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you