Saturday, September 5, 2026
HomeLATESTSivaji :ఓటీటీలో సినిమాలు చూసేవారు సోమరిపోతులు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!

Sivaji :ఓటీటీలో సినిమాలు చూసేవారు సోమరిపోతులు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!

Sivaji: ప్రముఖ సినీ నటుడు శివాజీ ఓటీటీలో సినిమాలు చూసే వాళ్ల గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

on
- Advertisement -banner Ad

Sivaji :కరోనా సమయం నుంచి ఎక్కువగా ఓటీటీ వర్సెస్ థియేటర్ల విభాగం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం పైన ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ విషయం పైన చాలామంది తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఓటీటి ప్లాట్ ఫామ్ పైన శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్..

సోమరిపోతులు ఓటీటీలోనే సినిమాలు చూస్తారా..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ(Sivaji )మాట్లాడుతూ ఓటీటి ప్లాట్ఫామ్ పైన నేరుగానే విమర్శలు చేశారు. ఓటిపి అనేది కేవలం సోమరిపోతుల కోసమే అన్నట్టుగా ఆయన అభివర్ణించారు. ఇంట్లో కూర్చొని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే వాళ్ల సంఖ్య పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకీ గణనీయంగా తగ్గుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన 90 S మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ గురించి శివాజీ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ బదులుగా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే సులువుగా 100 కోట్లు మార్కులు అందుకునేదంటూ శివాజీ మాట్లాడారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Duniya Vijay:భార్యతో విడాకులు తీసుకున్న దునియా విజయ్..!

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

మిడిల్ క్లాస్ చిత్రంలో ఎన్నో బాగోద్వేగాలు సరళమైన కథాంశంతో రూపొందించిన ఈ సిరీస్ కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలిపారు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ పై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయన మాటలను వక్రీకరిస్తుండగా మరి కొంతమంది ఏకీభవిస్తున్నారు. ఓటీటీల వల్ల థియేటర్లకు వెళ్లే సంస్కృతి తగ్గిపోతోందని తెలుపుతున్నారు. మరి కొంతమంది మాత్రం థియేటర్ల టికెట్లు ధరల రేటు, తినుబండారాల ఖర్చు విపరీతంగా పెరగడం వల్లే చాలామంది ఫ్యామిలీలతో సినిమాలకు వెళ్లడం లేదనీ, అందుకే చాలామంది ఓటిటినే సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

ఓటీటీ ల తోనే గుర్తింపు..

ముఖ్యంగా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నది ఓటీటీ ప్లాట్ఫారం వల్లే కావడం గమనార్హం. ఓటిటి ద్వారా విజయం సాధించిన ఒక కథ థియేటర్లలో కూడా అంతే స్థాయిలో 100 కోట్లను రాబట్టగలదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ మధ్యకాలంలో శివాజీ పలు చిత్రాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజులలో కూడా స్టార్ హీరోల చిత్రాలలో విలన్ పాత్రలలో నటించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. శివాజీ కూడా తనకు పాత్ర నచ్చితే తాను ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉన్నానని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you