Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ గా పేరు సంపాదించిన వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ఆమె ఒక సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ బాగానే సక్సెస్ అవుతోంది. గత కొంతకాలంగా డీప్ ఫేక్ బారిన పడుతున్న సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇటీవలే చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాంటి డీప్ ఫేక్ బారిన పడ్డాం అంటూ చాలామంది కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. అలా సెప్టెంబర్ 3 ,2026 న బాంబే హైకోర్టు శృతిహాసన్ కు సంబంధించి ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది.
డీప్ ఫేక్ వీడియోలతో భారీ మోసం..
ఏఐ టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకొని సృష్టించిన నకిలీ ఫోటోలను, అశ్లీల డీప్ ఫేక్ వీడియోలను సైతం ఇంటర్నెట్ నుంచి తీసేయాలంటూ కోర్టు సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హీరోయిన్ శృతిహాసన్ ఫేస్ ఉపయోగించుకొని అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలు చేయడమే కాకుండా ఆమె అనుమతి లేకుండా నకిలీ అకౌంట్ ల ద్వారా పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ ను చేస్తూ వస్తువుల అమ్మకాలను కొనసాగిస్తున్నారని, దీంతో తన పరువు కి భంగం కలిగించేలా ఉందంటూ శృతిహాసన్ (Shruti Haasan)ఆగస్టులో కోర్టుని ఆశ్రయించారు.
ALSO READ:Suman:”ఇండస్ట్రీలో పనికిమాలిన సినిమాలు ఎక్కువైపోయాయి”.. సుమన్ షాకింగ్ కామెంట్స్!
కోర్ట్ కీలక ఆదేశాలు..
అంతేకాకుండా 15 కోట్ల రూపాయలు నష్టపరిహారం కోరుతూ దావా కూడా వేసింది శృతిహాసన్. ఈ కేసును విచారించిన జస్టిస్ మాధవ్ శృతిహాసన్ వైపు ఉన్న న్యాయాన్ని అంగీకరిస్తూ.. ఇలాంటి తప్పుడు కంటెంట్ ఇంటర్నెట్లో ఉంటే కచ్చితంగా ఆమె ప్రతిష్టకు భంగం కలుగుతుందని, కేవలం డబ్బులు ఇవ్వడం వల్ల ఈ నష్టం పూడదనీ, సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవం, గోప్యత అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలోకి వస్తాయంటూ కోర్టు కూడా మరోసారి గుర్తుచేసింది. అందుకే హీరోయిన్ శృతిహాసన్ గుర్తించిన ఆ తప్పుడు లింకులను వీడియోలను ఇంటర్నెట్లో లేకుండా వెంటనే డిలీట్ చేయాలని, ఆ నకిలీ అకౌంట్లను నడుపుతున్న వారి వివరాలను కూడా బయట పెట్టాలంటూ హైకోర్టు గట్టిగా హెచ్చరించింది.
ALSO READ:Saha Movie Review:‘సహ’ మూవీ రివ్యూ: ప్రేమ, పెళ్లి, బాధ్యతలు.. సినిమా ఎలా ఉందంటే?
శృతిహాసన్ సినిమాలు..
నటి శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్లో కూడా ఈమె కనిపించబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో కూడా టీచర్ పాత్రలో కనిపించబోతోంది. విజయ్ సేతుపతి నటించబోతున్న ట్రెయిన్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించబోతోంది. ఇవే కాకుండా కొన్ని రకాల చిత్రాలలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగులలో కూడా నటించడానికి సిద్ధంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ.




