Tuesday, September 8, 2026
HomeLATESTToxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!

Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!

Toxic:యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Toxic:తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది అన్నట్లు తయారైంది ‘టాక్సిక్’ సినిమా పరిస్థితి. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అందరికీ ఎక్కినట్లే అనిపించినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అట్టర్ ఫ్లాప్ అనే రేంజ్‌లో టాక్ దక్కించుకుంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమాకు భారీ నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు పరిస్థితి ఎలా ఉందో.. సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే.

మొదటి రోజు భారీ కలెక్షన్స్.. రెండో రోజు నుంచే దారుణమైన డ్రాప్ :

మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా కలెక్షన్స్ రాబట్టుకున్న ‘టాక్సిక్’(Toxic).. రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయింది. అసలు యష్ కెరీర్‌లోనే చెత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. డబ్బులు రాకపోయినా పర్వాలేదు.. ఉన్న యష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చాలామంది కామెంట్స్ చేశారు. అసలు ఎందుకు ఈ సినిమాను ఓకే చేశాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా?

స్టార్స్‌పై దారుణమైన ట్రోల్స్ :

ఇక నయనతార, రుక్మిణి వసంత్‌ను గురించి అయితే సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కియారా అద్వానీని అయితే ట్రోలర్స్ ఆడేసుకున్నారు. ఆమె కెరీర్ ఇక ఫ్లాప్ అని.. ఇలాంటి సినిమాల్లో నటించదు అంటూ దారుణాతి దారుణంగా విమర్శించారు.

- Advertisement -
Advertisement

also read:TV:ఈ మంగళవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

ఓటీటీ హక్కుల విషయంలోనూ దెబ్బ :

ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు డిజిటల్, శాటిలైట్ హక్కుల విషయంలో కూడా ‘టాక్సిక్’కు దెబ్బ తగిలింది. విడుదలకు ముందు ‘టాక్సిక్’ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందట. కానీ అప్పుడు నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. అందుకే ఈ సినిమాకు రూ.250 కోట్లు అనుకున్నారట. అయితే అంత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవ్వలేకపోవడంతో.. వెనక్కి తగ్గాయి. సీన్ కట్ చేస్తే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు భారీ నెగిటివ్ టాక్ వచ్చింది.

- Advertisement -
Advertisement

రూ.150 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పడిపోయిందా? :

అప్పుడు ఏ సంస్థలైతే రూ.150 కోట్లు ఇస్తామని అన్నాయో.. ఇప్పుడు అదే సంస్థలు రూ.30 కోట్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వము అంటూ చేతులు దులిపేసుకున్నాయట. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 రూ.30 కోట్లకు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ముందుగా థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ‘టాక్సిక్’ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారిపోయినట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్‌లోనే ఓటీటీలోకి ‘టాక్సిక్’? :

నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సెప్టెంబర్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావచ్చు అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై మరింత అప్‌డేట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా డిజిటల్ హక్కుల డీల్‌పై మరింత హీట్ పెరుగుతోంది. రూ.150 కోట్లు అక్కడ.. రూ.30 కోట్లకు ఇక్కడ.. ఈ రేంజ్‌కు పడిపోయిందా అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you