Thursday, September 17, 2026
HomeLATESTDada Saheb falke award:కేజిఎఫ్ నటుడికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు..!

Dada Saheb falke award:కేజిఎఫ్ నటుడికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు..!

Dada Saheb falke award: చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కన్నడ నటుడిని వరించింది.

on
- Advertisement -banner Ad

Dada Saheb falke award:భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దాదా సాహెబ్ పాల్కే అవార్డు. అయితే ఈసారి ఈ అవార్డు ప్రముఖ బహుభాషా నటుడుగా పేరు సంపాదించిన కన్నడ నటుడు అనంత్ నాగ్ ను వరించింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ సినీ చలనచిత్ర పరిశ్రమలో జీవితకాల సాధనకు ఇచ్చే ఈ అరుదైన గౌరవం అనంత్ నాగ్ రావడంతో కన్నడ సినీ ప్రముఖులే కాకుండా ఇతర భాష నటీనటులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనెల 22వ తేదీన ఈ అవార్డు ఆయన అందుకోబోతున్నారు.

అనంత్ నాగ్ సినీ కెరియర్..

అనంత్ నాగ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 1970లో నాటక రంగం ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆర్ట్స్ కమర్షియల్ సినిమాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. హిందీ చిత్రమైన అంకుర్ (1974) సినిమా ద్వారా అనంత్ నాగ్ సినీ ఎంట్రీ ఇచ్చారు ..ఆ తర్వాత మందన్, కలియుగ్ తదితర ఎన్నో హిందీ చిత్రాలలో నటించి తన సహజమైన నటనతో జాతీయస్థాయిలో పేరు సంపాదించారు. కన్నడ లో మాల్గుడి డేస్ అనే టీవీ సీరిస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Nani The Paradise:ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ..!

300కు పైగా చిత్రాలు..

ఆ తర్వాత అనంత్ నాగ్ ఎన్నో చిత్రాలలో, అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో బాగా పేరు తెచ్చి పెట్టిన చిత్రాలను కేజిఎఫ్, గాలిపట, సర్కారీ హిరియ లాంటి చిత్రాల ద్వారా తన నటన ను చాటుకున్నారు. కన్నడలోనే కాకుండా హిందీ, మలయాళం, మరాఠీ వంటి భాషలలో 300కు పైగా చిత్రాలలో నటించారు అనంత్ నాగ్. కేవలం నటుడు గానే కాకుండా రాజకీయాలలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కర్ణాటక శాసనమండలి సభ్యుడుగా మంత్రిగా కూడా పనిచేసే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Sneha:స్నేహ చిరకాల కోరికను తీర్చనున్న మెగాస్టార్ చిరంజీవి?

నరేంద్ర మోడీ హర్షం..

అనంత్ నాగ్ కు దాదాసా హెబ్ పాల్కే అవార్డు(Dada Saheb falke award) రావడం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి అద్భుతమైన నటుడికి ఈ అవార్డు లభించడం చాలా సంతోషకరంగా ఉంది కొన్ని దశాబ్దాలుగా ఆయన తన సహజసిద్ధమైన నటన, ప్రతిభతో ఇండియన్ సినీ పరిశ్రమపై ప్రత్యేకించి కన్నడ సినిమాపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన పోషించిన ప్రతిపాత్ర కూడా అరుదైన లోతును వాస్తవికతతో నింపారు.. ఇండియన్ సినీ పరిశ్రమ రంగానికి విశిష్ట సేవలు అందించిన ఒక గొప్ప కళాకారుడుకి దక్కిన ఈ అత్యున్నత గౌరవం పూర్తిగా సమంజసమైనదే అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you