Friday, September 18, 2026
HomeLATESTVishal:షూటింగ్‌లో విశాల్‌కు గాయాలు.. అసలేం జరిగిందంటే?

Vishal:షూటింగ్‌లో విశాల్‌కు గాయాలు.. అసలేం జరిగిందంటే?

Vishal:తమిళ హీరో విశాల్‌ నటిస్తున్న ‘సుందర్‌ సి పురుషన్‌’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు.

on
- Advertisement -banner Ad

Vishal:రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు తమ సినిమా షూటింగ్ సమయంలో గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖ హీరోలు, హీరోయిన్లు తమ ప్రతిష్టాత్మకమైన సినిమా షూటింగ్స్‌లో నటిస్తూ గాయాలపాలై.. కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకునే స్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి తమిళ హీరో విశాల్ కూడా యాడ్ అయిపోయాడు.

విశాల్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ :

విశాల్ (Vishal)గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పేరుకి తమిళ హీరోనే కానీ.. తెలుగులో మాత్రం హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించే సినిమాలు చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ సమేతంగా చూడొచ్చు, ఆకట్టుకునేలా ఉంటాయి అన్న మార్క్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఆయన తన సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement

‘మొగుడు’ సినిమా షూటింగ్‌లో విశాల్ :

ప్రస్తుతం విశాల్ సుందర్.సి దర్శకత్వంలో ‘పురుషన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘మొగుడు’ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ టు ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం డూప్ లేకుండా విశాల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి.

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటివరకు విశాల్ కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయనటువంటి కథతో ఈ సినిమాతో రాబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బాగా సర్కులేట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:The Paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్లో కనిపించని కయాదు లోహార్..!

పోరాట సన్నివేశాల్లో గాయపడిన విశాల్ :

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే గురువారం ఈ సినిమాకు సంబంధించిన పోరాట దృశ్యాలు షూట్ చేస్తుండగా విశాల్ గాయాలపాలైనట్లు తెలుస్తుంది. విశాల్ తగిన సేఫ్టీ తీసుకోకపోవడం కారణంగా స్వల్పంగా గాయపడ్డారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

- Advertisement -
Advertisement

దీంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి.. ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకునే విధంగా డాక్టర్లు సూచించారు అన్న న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడిపోయారు.

also read:Missing Meghana Review: ఊహించని ట్విస్టులతో సాగిన మిస్టరీ థ్రిల్లర్!

విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం :

చిత్ర బృందం ఎట్టకేలకు స్పందించింది. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం బాగానే ఉంది అని, విశ్రాంతి తీసుకుంటున్నారు అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలో విశాల్ సరసన హీరోయిన్ తమన్నా నటిస్తూ ఉండడం హైలైట్‌గా మారింది. డూప్ లేకుండా విశాల్ ఇంత కష్టపడి సినిమా కోసం నటిస్తున్నాడు అంటే.. కచ్చితంగా సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది అని అభిమానులు భావిస్తున్నారు. విశాల్ త్వరగా కోలుకుని సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you