Saturday, September 19, 2026
HomeLATESTAgadha OTT:ఆత్మలు.. క్షుద్రశక్తి.. భయంకరమైన మిస్టరీ.. ఓటీటీలోకి ‘అగధ’!

Agadha OTT:ఆత్మలు.. క్షుద్రశక్తి.. భయంకరమైన మిస్టరీ.. ఓటీటీలోకి ‘అగధ’!

Agadha OTT:ఎంఎస్ రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’.

on
- Advertisement -banner Ad

Agadha OTT:సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్, మిస్టరీ, దైవిక అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ :

థియేటర్లలో విడుదలై కొన్ని వారాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘అగధ’ ఓటీటీ (Agadha OTT)బాట పట్టింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5లో సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు వచ్చే వారం నుంచి ఇంటి నుంచే వీక్షించే అవకాశం లభించనుంది.

- Advertisement -
Advertisement

భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం :

‘అగధ’ చిత్రాన్ని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించగా, అజయ్ కేఆర్ సమర్పించారు. కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వైవా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించగా, రాకేష్ వెంకటాపురం నేపథ్య సంగీతం సమకూర్చారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా పనిచేశారు.

ALSO READ:Panchanama:ఓటీటీలో రికార్డ్ సృష్టించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -
Advertisement

ఆత్మలు.. క్షుద్రశక్తి చుట్టూ కథ :

కథలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని ఓ గ్రామంలో మహాదేవి అనే మహిళ నివసిస్తుంటుంది. దెయ్యం పట్టిన వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆమెకు ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. మహాదేవి గురించి తెలుసుకునేందుకు నగరం నుంచి మానస, సంజయ్ అక్కడికి చేరుకుంటారు. ఈ క్రమంలో ఆమె గతంతో పాటు కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తాయి.

మహాదేవి బాబాయ్ కుమార్తె మహిమ గర్భవతిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఇంట్లో మరికొన్ని ఆత్మలు సంచరిస్తున్నాయని మహాదేవి గుర్తిస్తుంది. మహిమ మరణం, ఆమె ప్రియుడు సింహా అదృశ్యం, బబ్లూ హత్య వెనుక ‘అగధ’ అనే భయంకరమైన క్షుద్రశక్తి ఉందని ఆమె తెలుసుకుంటుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Kayadu Lohar: ఒక్క స్టిల్.. మాయలో పడిపోతున్న కుర్ర కారు.. కయాదు లేటెస్ట్ ఫోటో గ్యాలరీ వైరల్!

అసలు ‘అగధ’ ఎవరు? :

తన కుటుంబాన్ని వెంటాడుతున్న దుష్టశక్తి అసలు రహస్యం ఏమిటో మహాదేవి ఎలా తెలుసుకుంది? ఆ శక్తిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ‘అగధ’లోని మిగతా కథ. మిస్టరీ, ఉత్కంఠభరితమైన ట్విస్టులు, దైవిక అంశాలతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తిగా కొనసాగిస్తుంది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమాను ప్రేక్షకులు డిజిటల్‌గా వీక్షించవచ్చు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you