Atlee:మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘బత్తా’ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది. దర్శకుడు బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అట్లీ నిర్మించారు. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతితో పాటు అట్లీ, చిత్రబృందం హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
విజయ్ సేతుపతి కామెంట్స్‌పై వివాదం :
ఇటీవల బిగ్‌బాస్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. సమస్య ఎదురైనప్పుడు ఇతరులపై నిందలు వేసి తప్పించుకోవడం నాయకుడి లక్షణం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు తమిళనాడు రాజకీయాల్లోని విజయ్ను ఉద్దేశించే చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో విజయ్ సేతుపతి, విజయ్ అభిమానుల మధ్య ఆన్లైన్లో చర్చ నడిచింది.
ఈ వివాదంపై ‘బత్తా’ ఆడియో లాంచ్‌లో విజయ్ సేతుపతి స్పందిస్తారని అభిమానులు భావించారు. అయితే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఉండగా, అట్లీ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.
ALSO READ:Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా వాయిదా..?
విజయ్‌పై అట్లీ ప్రశంసలు :
వేదికపై మాట్లాడిన అట్లీ(Atlee).. తన కెరీర్లో విజయ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు వచ్చినప్పటికీ, విజయ్ తనకు వరుస అవకాశాలు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా విజయ్ తనను ప్రోత్సహించారని అట్లీ గుర్తుచేశారు. ఆ అవకాశం తన జీవితాన్ని మార్చేస్తుందని విజయ్ అప్పట్లో చెప్పారని, ఆయన మాటలు నిజమయ్యాయని అన్నారు. విజయ్‌కు తన కృతజ్ఞతలు ఎప్పటికీ ఉంటాయని అట్లీ పేర్కొన్నారు.
ALSO READ:Hatah teaser:సరికొత్తగా హతః టీజర్.. చూశారా..?
గాడిద కథతో అట్లీ సందేశం :
అనంతరం అట్లీ ఓ చిన్న కథను చెబుతూ సోషల్ మీడియా విమర్శలపై పరోక్షంగా స్పందించారు. ఓ వ్యక్తి గాడిదపై బట్టల మూట వేసుకుని వెళ్తుంటే ఒక ఊరివారు విమర్శించారని, దాంతో మూటను తన తలపై పెట్టుకున్నాడని చెప్పారు. అప్పుడు మరో వ్యక్తి గాడిదను పక్కన పెట్టుకుని మూటను తలపై మోస్తున్నాడంటూ మళ్లీ విమర్శించాడని వివరించారు.
ఎవరు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోకుండా తమ లక్ష్యం వైపు ముందుకు సాగాలని అట్లీ సూచించారు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు కామెంట్లు చేస్తున్నారంటూ వచ్చే ప్రచారాలను పట్టించుకోవద్దని చెప్పారు. చెప్పాల్సిన విషయాన్ని నేరుగా చెప్పొచ్చని పేర్కొన్నారు. తన ప్రసంగంతో అట్లీ విజయ్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.




