Monday, September 21, 2026
HomeLATESTRamanandana Couple:రమానందన వీసా స్కామ్ కేసులో మరో ఊహించని ట్విస్ట్..ఇక చచ్చింది గొర్రె..!

Ramanandana Couple:రమానందన వీసా స్కామ్ కేసులో మరో ఊహించని ట్విస్ట్..ఇక చచ్చింది గొర్రె..!

Ramanandana Couple:రమానందన దంపతుల చుట్టూ పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Ramanandana Couple:యూట్యూబర్ నందు అలియాస్ రమానందన పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా మారుమ్రోగిపోతుందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వార మంచి పేరు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురి అవుతుంది. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా ప్రక్రియను సులభంగా పూర్తి చేయిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారంటూ యూట్యూబర్ నందు(Ramanandana Couple) పై పలువురు బాధితులు ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. బేగంపేటలోని జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో వారు తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

బాధితులు ప్రజావాణి ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, నోడల్ అధికారి విద్యాసాగర్, ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. వినోద్‌కుమార్‌ను కలిసి తమకు ఎదురైన సమస్యను వివరించారు. తమ కన్సల్టెన్సీకి యూకే ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు అధికారిక అనుమతులు ఉన్నాయని నందన, ఆమె భర్త మధుకర్ చెప్పి తమను నమ్మించారని బాధితులు ఫిర్యాదులో ఆరోపించారు.

- Advertisement -
Advertisement

నకిలీ పత్రాలతో ఉద్యోగ వీసా.. భారీగా డబ్బుల వసూళ్లు :

ఇప్పటికే స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకేకు వెళ్లిన వారినే టార్గెట్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. వారి వీసా గడువు ముగిసేలోపు ఉద్యోగ వీసా ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ వీసా కోసం కన్సల్టెన్సీ ద్వారా సమర్పించిన పత్రాలు నకిలీవని ఆ తర్వాత గుర్తించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం కారణంగా కొంతమందిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసానికి గురైన విషయం తెలిసేలోపే భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు.

also read:Jailer 2:నీలి చీరలో విద్యాబాలన్.. జైలర్ 2లో ఆ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

- Advertisement -
Advertisement

పలు రాష్ట్రాల్లో బాధితులు :

ఈ వ్యవహారంలో తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.

also read:Aishwarya Rajesh:యూట్యూబర్ కి ముద్దు పెట్టిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!

- Advertisement -
Advertisement

డీజీపీ, ఈడీకి ఫిర్యాదు చేయాలని సూచన :

బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం ప్రజావాణి బాధ్యులు ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కేసు దర్యాప్తు విషయంలో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేశారన్న ఆరోపణలపై తదుపరి దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఆదేశాలు ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పరిస్ధితులు చూస్తుంటే రోజు రోజు కి ఈ కేస్ మరింత సీరియస్ గా మారిపోతుందని జనాలు మాట్లాడుకుంటున్నారు..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you