Varanasi Mahesh Babu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాకుండా దేశ విదేశాలలో ఉండే అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబుని ఎలా చూపిస్తారు అనే విషయం పైన ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తెలియజేశారు రాజమౌళి. ఆ అప్డేట్ల ప్రకారం సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నారని తెలిసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
మహేష్ బాబు పార్ట్ షూటింగ్ కంప్లీట్..
మహేష్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో 2027 ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ గ్లోబ్ ట్రోటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ వేగంగా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు కి సంబంధించి షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నాటితో తన షూటింగ్ షెడ్యూల్ ముగించడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కి యూనిట్ ప్యాకప్ చెప్పేసినట్లు వినిపిస్తోంది.
also read:Aishwarya Lakshmi :డ్రెస్‌పై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ రియాక్షన్!
ఫ్రీ బర్డ్ గా మారిన మహేష్ బాబు..
దీంతో మహేష్ బాబు ఇక మీదట ఫ్రీ అయిపోయినట్టే అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ బాగానే రాజమౌళి అక్టోబర్ మొదటి వారంలో ఫినిష్ చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సైతం తిరగరాసేందుకు సిద్ధమవుతోంది వారణాసి మూవీ. సాధారణంగా రాజమౌళి చేతిలో ఏ హీరో అయిన పడ్డాడు అంటే చాలు కనీసం రెండు మూడు ఏళ్ళ పాటు మరే సినిమాని ఒప్పుకోరు. కానీ మహేష్ బాబు వారణాసి (Varanasi Mahesh) Babuసినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
also read:Dimple Hayathi:తిరుమలలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తెలుగు హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా..?
అనుకున్న తేదీకే విడుదల..
వచ్చే నెల నుంచి విఎఫ్ఎక్స్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల పైన చిత్ర బృందం ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పైన సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా వారణాసి సినిమాలో రుద్రాకు తన తండ్రికి ఉన్న ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయి. ఇంటర్వెల్ తర్వాత గ్లోబ్ ట్రోటర్ గా ఉన్న రుద్ర శ్రీరాముడిగా మారుతారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులకు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 120 కి పైగా దేశాలలో కనివిని ఎనుగని రీతిలో వారణాసి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాలో నటించగా.. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. మరి వారణాసి తరువాత చిత్రం ఏ డైరెక్టర్ తో చేస్తారో చూడాలి మరి.




