Sampoornesh Babu:ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదే సంపూర్ణేష్ బాబుని ఇంటర్వ్యూ చేస్తున్న ఒక వీడియో క్లిప్. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలకు పిలుస్తూ ఉంటారు. అలాగే సంపూర్ణేష్ బాబు ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్‌లో మెరిశారు.
సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్‌పై భారీ అంచనాలు :
సినిమా రిలీజ్‌కు ముందు ఈ క్యారెక్టర్‌కు ఎంత హైప్ ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే. ఏకంగా స్టేజ్‌పై నాని కూడా సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ వేరే లెవెల్‌లో ఉంటుంది, ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని కాన్ఫిడెన్స్ లెవెల్ పీక్స్‌లో ఉండేలా మాట్లాడారు. ఈ క్రమంలోనే పలువురు జర్నలిస్టులు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు.
ALSO READ:Sumalatha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్యపై దాడి..!
వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ వీడియో :
రీసెంట్‌గా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ప్రముఖ జర్నలిస్ట్ సంపూర్ణేష్ బాబుని ఇంటర్వ్యూ చేస్తూ ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. అసలు నీది హీరో మెటీరియలేనా? నిన్ను ఏం చూసి సినిమాల్లో హీరోగా తీసుకోవాలి? నువ్వు ఏం అనుకుని హీరో అవుద్దాం అనుకున్నావ్య్..? అంటూ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
అంతేకాదు, ఆ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu)ఇబ్బంది పడిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా లేచి వెళ్లిపోదామా…? అన్న విధంగా ఆయన ఎక్స్ ప్రేషన్స్ ఉన్నాయి. అంతేకాదు, ‘ది ప్యారడైజ్’ సినిమాలో నువ్వు నటించే పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలుసుగా? నీకు అలాంటి రోల్ వస్తుందని నువ్వు అనుకున్నావా? అసలు నీకు అలాంటి క్యారెక్టర్ ఎలా ఇచ్చారు? అంత పెద్ద క్యారెక్టర్‌కు నువ్వు అర్హుడివేనా? అన్న విధంగా ఆయన కౌంటర్‌లతో మాట్లాడిన పద్ధతి సంపూర్ణేష్ బాబు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
ALSO READ:Nani:నాని సినిమా ఫ్లాప్ అవ్వాలని ఆ స్టార్ హీరో భార్యభర్తలు పూజలు చేశారా..?
సంపూర్ణేష్ బాబుకు ఫ్యాన్స్ సపోర్ట్ :
దీంతో సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, సంపూర్ణేష్ బాబుకు సపోర్ట్ చేస్తూ ఆయనలో మంచి టాలెంట్ ఉంది, ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, కుట్రలు, కుతంత్రాలు చేసి ఆయనను తొక్కేయొద్దు అంటూ సంపూర్ణేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
జర్నలిస్టుపై నెటిజన్ల కామెంట్స్ :
ఇక సోషల్ మీడియాలో ఆ వీడియో కింద అయితే ఆ జర్నలిస్టుని అసభ్యకరమైన పదాలతో దూషిస్తున్నారు. అసలు ఇంటర్వ్యూ చేయడం వచ్చా నీకు? సంపూర్ణేష్ బాబుతో ఇలానే ఇంటర్వ్యూ చేస్తావా? అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇదే ప్రశ్న పెద్ద స్టార్స్‌ను అడిగే దమ్ము, ధైర్యం నీకుందా? ఎక్కడ నుండి వస్తారు అయ్యా మీరు టాలెంట్ ని తొక్కేయడానికి..? అంటూ ఓపెన్‌గానే రియాక్ట్ అవుతున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అసలు మీకు ఏం అర్హత ఉందని ఒక నటుణ్ని ఏకవచనం తో పిలవడానికి.
సినిమాల్లో నిన్ను ఎవరు పెడతారు అసలు అని ఎలా అంటారు?
TNR Sir Interview Untadhi #Sampoorneshbabu Garitho. Once Chudandi Interview Ela cheyyalo telusthundhi.. pic.twitter.com/9s9bh9n3RM
— Telangana Box Office (@Telangana_BO) September 23, 2026




